ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను హైదరాబాద్ పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొత్త సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయగా.. సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించవద్దని, ఏప్రిల్ 14న ప్రారంభించాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి.. కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించడం ఏంటని పాల్ ప్రశ్నించారు.