వైసీపీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశమైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,వారి దగ్గర తన అభిమతాన్ని, ఆవేదనను వెల్లడించినట్టు సమాచారం. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని కార్యకర్తలతో వ్యాఖ్యానించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని అన్నారు. తమ్ముడికి పోటీగా తాను నిలబడనని చెప్పారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చెప్పుకొచ్చారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని అన్నారు.