హాస్యబ్రహ్మ బ్రహ్మానందం జననం : ఎంతో ప్రఖ్యాతి చెందిన తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. తెలుగు తమిళంతో పాటు వివిధ భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ రికార్డు కూడా ఎక్కాడు
జన్మదిన శుభాకాంక్షలు 🌷💐🌺💐🍀🌸
ఫిబ్రవరి 1, అంటే రేపు ప్రముఖ హాస్యనటుడు శ్రీ “బ్రహ్మానందం” గారి పుట్టినరోజు సందర్భంగా…
“కన్నెగంటి బ్రహ్మానందం” ప్రఖ్యాత తెలుగు హాస్య నటులు. వివిధ భాషలలో తక్కువ కాలంలో 1250కి పైగా సినిమాలలో నటించారు. 2010 లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు!!
బ్రహ్మానందం జీవిత విశేషాలను 108 పద్యాల్లో వివరిస్తూ ఒక ప్రముఖ కవి వ్రాసిన “బ్రహ్మానంద శతకం” పుస్తక ఆవిష్కరణ(2021లో)తో, ఏ సినీ నటునికి దక్కని గౌరవం బ్రహ్మానందానికి దక్కింది!!
భారత ప్రభుత్వం “పద్మశ్రీ” పురస్కారం ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ NV రమణ గారి చేతుల మీదుగా 2021లో రామినేని ఫౌండేషన్ వారి “విశేష పురస్కారం” అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు “గౌరవ డాక్టరేటు” ప్రదానం చేసింది. ఉత్తమ హాస్య నటుడిగా “ఐదు నంది పురస్కారాలు”, ఒక “ఫిల్మ్ ఫేర్” పురస్కారం, మూడు “సైమా” పురస్కారాలు అందుకున్నారు.
జననం:
1956 ఫిభ్రవరి1న తల్లిగారి పుట్టిల్లైన ముప్పాళ్ళ మండలం ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పెరిగారు. తల్లిదండ్రులు
శ్రీ నాగలింగాచారి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ.
బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్. ఒకరు ఎం. బి. ఏ మరొకరు
బి. టెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా ‘పల్లకిలో పెళ్ళికూతురు’ అనే చిత్రం వచ్చింది.
బ్రహ్మానందానికి ఒక మనుమడు, ఒక మనుమరాలు.
కోట్లాది ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం, మనుమడు “పార్ధా” చేసే చిలిపి చేష్టలకు కడుపుబ్బ నవ్వేస్తుంటాడు.
బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఈయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో తనకు చిన్నప్పటి నుండి తెలిసిన చిత్రకళకు పదునుపెట్టి బొమ్మలు కూడా గీస్తుంటాడు. ముఖ్యంగా ఇటీవల సమయంలో ఆయన గీసిన
శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రం ఎంతో మంది ప్రశంశలను పొందింది. తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు కూడా అబ్బింది.
అవార్డులు – సత్కారాలు:
నటుడిగా గుర్తింపు నిచ్చిన “అహ నా పెళ్లంట” చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు.
*ఐదు కళాసాగర్ పురస్కారాలు
*తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు
*పది సినీగోయర్స్ పురస్కారాలు
*ఎనిమిది భరతముని పురస్కారాలు
*ఒక్క ఫిలింఫేర్ పురస్కారము
*రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
*ఆటా (అమెరికా), సింగపూర్, మలేషియా, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు!
*విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు!
*పద్మమోహన” సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది!
*సత్తెనపల్లి ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్, జర్నలిస్టు అసోసియేషన్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి, స్వర్ణ కమలాలతో “కనకాభిషేకం” చేశారు.
*అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును అందుకున్నారు!
*హస్య నటులయిన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన!
*‘హాస్య కళా విధాత’ అవార్డు ను టీ.ఎస్.ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ (విశాఖపట్నం)వారి నుండి అందుకున్నారు.
గుప్త దానాలు చెయ్యడం ఈయన హాబీ! అతి నిరుపేదలకు ఉపయోగపడే పనులు చెయ్యాలన్నది వీరి ఆశయం. అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు! ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులతో వారి ఆశయం సఫలం కావాలని కోరుకుందాం!!
అభిప్రాయాలు:
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు:
“హాస్యనటుల్లో బ్రహ్మానందం చదువుకున్నవాడు కావటం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది. ఆయనలో నిగూఢమైన మరొక మనిషి, ఒక వేదాంతి, ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది” అని కీ.శే.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒక సావనీర్ లో పేర్కొన్నారు.
శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం:
జంధ్యాల వారి స్నేహం ద్వారా నాకు
బ్రహ్మానందం పరిచయమైనారు. స్నేహ సౌరభాన్ని వెదజల్లుతూ, వినయ సంపదతో విలసిల్లుతూ, అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని బ్రహ్మానందం ఏర్పాటు చేసుకున్నారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు!
“శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనుపించినా ఆయన ఎంతటి భక్తి తత్పరులో, సాహిత్య ప్రియులో, గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తి గతంగా ఎరుక” అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.