గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గుడ్ విల్ లో భాగగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తో భేటీ అయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ జనవరి 30న 75వ వర్థంతి సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి న్యూయార్క్ సిటీ హాల్ లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం పురాతన కాలం నుండి నేటికి ప్రసిద్ది చెందడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు గ్లోబల్ సిటీ గా రూపాంతరం చెందుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం సిస్టర్ సిటీ రిలేషన్ షిప్ ద్వారా భౌతికంగా అభివృద్ధి చెందిన సిటీలతో పరస్పర సహకారం, బిజినెస్ లో అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు.