Food

కిస్మిస్లు రోజు తినండి.. అద్భుత ప్రయోజనాలు పొందండి

కిస్మిస్లు రోజు తినండి.. అద్భుత ప్రయోజనాలు పొందండి

కిస్మిస్ పండ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచికి తియ్య‌గా, కాస్త పుల్ల‌గా కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి ప‌దార్థాల త‌యారీలో వేస్తుంటారు. అయితే వాస్త‌వానికి కిస్మిస్‌ల‌ను కేవ‌లం స్వీట్ల‌తోనే కాదు.. రోజూ తినాలి. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా చూసుకోవచ్చు. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కిస్మిస్‌లలో రాగి, ఇనుము, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. కాబట్టి ర‌క్త‌హీన‌త‌ ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. త్వరగా గాయాలు నయం అవుతాయి. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది