Politics

ఫోన్ టాపింగ్ పై మళ్లీ చెలరేగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఫోన్ టాపింగ్ పై మళ్లీ   చెలరేగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు: తన ఫోన్‌ ట్యాపింగ్‌.. అధికారుల పని కాదు.. ప్రభుత్వ పెద్దల పనని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘‘మంత్రులు, సలహాదారులు ఒక్కడిని చేసి మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలుగా విషప్రచారం చేస్తున్నారు. నేరాలు చేసిన వ్యక్తులే తాము నిరూపిస్తామని చెబుతున్నారు. నేను చివరి వరకు పార్టీలో ఉండి మోసం చేయలేదు. నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పు. నా తమ్ముడు అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యలు బాధించాయి. నేను తప్పు చేస్తే సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.