Movies

తారకరత్న గుండె, కాలేయం బాగున్నాయి.. మెదడుకు చికిత్స

తారకరత్న గుండె, కాలేయం బాగున్నాయి.. మెదడుకు చికిత్స

తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోందని.. గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

– ఈరోజు మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించారు.

★ సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో గత ఆరు రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

★ తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోంది. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి నేటి వరకు ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ప్రతి రోజు చికిత్సను అందిస్తున్నారు.

★ ఈ క్రమంలో తారకరత్న గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

★ ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు.

★ అనంతరం తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంప్రదింపులు జరిపారు.

★ తారకరత్న ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

★ నందమూరి తారకరత్నకు ఇక్కడి వైద్యులు వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్య సేవలను అందిస్తూ వస్తున్నారు.

★ తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తూ.. ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు.

★ మరోపక్క తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలన్నీ బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్సను త్వరలోనే చేయబోతున్నామని తాజాగా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

★ ఆ ప్రకారమే నేడు తారకరత్న మెదడుకు సంబంధించి చికిత్సను వైద్యులు ప్రారంభించారు.

★ తారకరత్న అనారోగ్యానికి గురైన రోజు నుంచి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న బాగోగులను చూసుకుంటూ.. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చలు జరుపుతున్నారు.

★ దీంతో బాలకృష్ణకు సినీ హీరోలు, ప్రముఖులు, తెదేపా పార్టీ కార్యకర్తలు, వైసీపీ మంత్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.