NRI-NRT

తానాఎన్నికలు. దూకుడు పెంచిన నిరంజన్ వర్గం..TNI ప్రత్యేకం

తానాఎన్నికలు. దూకుడు పెంచిన నిరంజన్ వర్గం..TNI ప్రత్యేకం

తానాఎన్నికలు. దూకుడు పెంచిన నిరంజన్ వర్గం..TNI ప్రత్యేకం

తానా లో ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు క్లైమాక్స్ కు చేరాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి నిరంజన్ వర్గం పట్టుదలతో ముందుకు వెళుతుంది. తానా బోర్డులో తమకున్న మెజారిటీని ఉపయోగించుకుని ఎన్నికలు నిర్వహించడానికి నిరంజన్ వర్గం సన్నాహాలు చేస్తోంది.ఎన్నికలు జరగకుండా అంజయ్య చౌదరి వర్గం ఎగ్జిక్యూటివ్ కమిటీ లో తమకున్న బలాన్ని అడ్డుపెట్టుకొని పావులు కదుపుతోంది.తమ చేతుల్లో ఉన్న తానా వెబ్ సైట్ ను స్తంభింపజేసింది.

చక్రం తిప్పుతున్న బండ్ల హనుమయ్య..

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే తానా బోర్డు చైర్మన్ డాక్టర్ బండ్ల హనుమయ్య ప్రస్తుతం తనకున్న అధికారాలను ఉపయోగిస్తూ ఎన్నికలు జరిపించడానికి ముందుకు వెళుతున్నారు .బోర్డు తరపున ఒక వెబ్ సైట్ ను రూపొందించారు. ఎన్నికల ప్రకటనను ఓటర్ల జాబితాను నామినేషన్ వివరాలను అందులో పొందుపరిచారు.ఇప్పటివరకు ఓటర్ల జాబితాను తమకు అందించడం లేదని ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నిస్తున్న అంజయ్య చౌదరి వర్గానికి సమాధానం చెప్పడం కోసమే కొత్త వెబ్ సైట్ ను బోర్డు ద్వారా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇరు వర్గాల వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేయటానికి కానీ తేదీలను మార్పు చేయటానికి కానీ తానా ఎన్నికల సంఘం సుముఖంగా లేదని సమాచారం. నామినేషన్ లు దాఖలు చేయడానికి పది రోజులు మాత్రమే సమయం ఉంది. మొత్తం మీద తానా ఎన్నికల పోరు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.

కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్