వైఎస్సార్‌సీపీ (Ysrcp) నుంచి మరో నేతపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Ys Jagan) ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన శరగడం చిన్న అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా అందిన ఫిర్యాదులతో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు శరగడం చిన్న అప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
విశాఖ పరిధిలోని పెందుర్తిలో చిన్న అప్పలనాయుడు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో టీడీపీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఉన్నారు. గతంలో అప్పలనాయుడు 71వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్సార్‌సీపీ రూరల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. అనంతరం విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెందుర్తి వచ్చిన ప్రతిసారీ కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.