– ఒక్కచాన్స్ తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
-చిత్తూరు నియోజకవర్గం బహిరంగసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి పని అయిపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వం వస్తోందని, అందరి సమస్యలు పరిష్కరిస్తుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
“జగన్ జనం మధ్య తిరగలేకపోతున్నాడు. ప్యాలెస్ పిల్లి ఒక వేళ బయటకొచ్చినా పరదాలు కట్టుకుని తిరుగుతోంది. ప్రజాదరణలో మనం పబ్లిక్ గా తిరుగుతున్నాం. మనది ప్రజాబలం. జనం ఆశీస్సులతో యువగళం పాదయాత్ర చేయగలుగుతున్నాం. నా ప్రచార రథం, మైక్ సీజు చేశారు. జగన్ రెడ్డి నీకు తెలుగుదేశం అంటే ఎందుకు ఇంత భయం? టిడిపి మద్దతుదారులని విద్యార్థులపై అటెంటివ్ మర్డర్ కేసులు పెట్టారు. కోర్టు చీవాట్లు పెట్టడంతో పోలీసులు విద్యార్థుల్ని వదిలేశారు. చట్టాలు ఉల్లంఘించి మరీ టిడిపి కేడర్ , లీడర్లపై కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తాం. తప్పుడు మార్గంలో చట్టాలు ఉల్లంఘించే పోలీసులకు తగిన గుణపాఠం చెప్తాం. జగన్ మోహన్ రెడ్డికి అసలైన భయం పరిచయం చేసే బాధ్యత నాదే. 2024 తరువాత జగన్ అనే వ్యక్తి ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా చేస్తా. లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధించడంలో చంద్రబాబు విశేష కృషి చేశారు. కంపెనీలు రప్పించి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. మహిళలకు పసుపు కుంకుమ కింద 20 వేలకోట్లు ప్రయోజనాలు కల్పించారు. చాలీచాలని పెన్షన్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలకు పింఛను రూ. 2000కి పెంచారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాం. ప్రతీ నెల ఒకటో తారీఖుని జీతాలు చెల్లించాం. బాబు ఒక బ్రాండ్- జగన్ అంటే జైలు. అభివృద్ధి వికేంద్రీకరణని రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబే. రాయలసీమకి కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్, డిక్సన్, అపోలో టైర్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలు తెప్పించారు. ఈ ప్రాంత యువత
2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తున్న సమయంలో ఒక్క చాన్స్ ఇవ్వండని వేడుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.
మోసానికి మానవరూపం జగన్ రెడ్డి, అందుకే జగన్ మోసపు రెడ్డి అని పేరు పెట్టాం.
జాబ్ క్యాలెండర్ ఇస్తామని యవతని ఛీట్ చేశాడు.
ప్రత్యేక హోదాని కేసుల కోసం తాకట్టు పెట్టాడు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మోసగించాడు
45 ఏళ్ల దాటిన మైనారిటీ ఎస్సీ,ఎస్టీ, బీసీల మహిళలకు పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు.
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తానని ఛీట్ చేశాడు.
సంపూర్ణ మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని, కల్తీ మద్యం పారిస్తున్న మోసగాడు జగన్.
మద్యనిషేధం హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి తన బినామీలతో కల్తీ మద్యం తయారీ, ప్యాకింగ్, రవాణా, సేల్స్ చేయిస్తూ మహిళల తాళిబొట్లు తెంచేస్తున్నాడు. ఇంకెక్కడి మద్యపాన నిషేధం?
జగన్ బ్రాండ్ మద్యం ల్యాబుకి పంపాం..పురుగు మందు పంట పొలాల్లో పనిచేస్తుందో లేదో కానీ..
బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కొడితే పురుగులు చనిపోతాయి.
పెంచుతూ పోతానని హామీ ఇచ్చిన జగన్ పెట్రోల్, డీజిల్ ధరలు,పన్నులు పెంచుకుంటూ పోతున్నాడు.
పీల్చే గాలిపైనా జగన్ పన్ను వేస్తాడు. ప్రతీ ఇంటికి వలంటీర్ వచ్చి మిషన్ మూతికి పెట్టి ఉఫ్ ఊదమంటారు..ఎంత గాలి పీల్చారో చూసి పన్ను వేస్తారు.
రాయలసీమకి పట్టిన శని జగన్ మోహన్ రెడ్డి
సీఎం అయిన నుంచీ అడుగడుగునా మోసం చేశాడు.
హంద్రీనీవా ఆపేశాడు..అమర్ రాజా పక్క రాష్ట్రానికి పంపేశాడు. రిలయన్స్ ని తరిమేశాడు..
వై నాట్ 175 సీట్లు అంటున్న జగన్
వై నాట్ స్పెషల్ స్టేటస్
వై నాట్ జాబ్ క్యాలెండర్
వై నాట్ సీపీఎస్ రద్దు
వై నాట్ పోలవరం
వై నాట్ విశాఖ రైల్వే జోన్
వీటి గురించి కూడా మాట్లాడాలి.
పగటి కలలు కంటూ ఉండే జగన్ రెడ్డి పరదాలు లేకుండా బయటకు వస్తే, ప్రజల్లో ఆవేదన తెలుస్తుంది.
జగన్ పాలనలో ఏపీ లాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలో నెంబర్ వన్ అయ్యింది. డ్రగ్స్, గంజాయి, అప్పుల్లో నెంబర్ వన్ చేశారు.
బాబాయ్ వివేకానందరెడ్డిని చంపింది అబ్బాయ్ జగన్ మోహన్ రెడ్డే. సీబీఐ విచారణకి పిలిచిన ప్రతిసారీ ఢిల్లీకి వెళ్లే జగన్ రెడ్డి, ఏ రోజు అయినా రాష్ట్రానికి ఏం ప్రాజెక్టు, నిధులు సాధించాడో చెప్పలేదు. తనపై ఉన్న కేసులు-బాబాయ్ హత్య కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేశాడు జగన్. లెక్కలేనన్ని సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రెడ్డి ప్రత్యేకహోదా, ఉక్కుఫ్యాక్టరీ, విశాఖ రైల్వేజోన్ గురించి ఒక్కసారైనా అడిగారా?
గంజాయి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని తేలితే ఢిల్లీలో కాళ్లు పట్టుకుని వదిలేయండంటూ అడుగుతున్నాడు.
బాబాయ్‌ని చంపేసిన క్రిమినల్ …
తల్లిని చెల్లిని గెంటేసిన క్రిమినల్ జగన్ జిల్లాకొక క్రిమినల్ ని తయారు చేశాడు.చిత్తూరు జిల్లాలో క్రిమినల్..దొంగ రెడ్డి.. పెద్దిరెడ్డి.
జిల్లాలో ఏ దోపిడీ అయినా పెద్దిరెడ్డిదే..
జేఎంసీ శ్రీనివాస్ శాసనసభ్యుడా? భూబకాసురుడా?
500 కోట్లు ప్రజాధనం దోచిన శ్రీనివాస్, 300 ఎకరాలు మింగేశాడు,..
పశువుల మేత భూమినీ మేసేసిన ఎమ్మెల్యే పని అయిపోయింది
రాష్ట్రాన్ని దోచిన జగన్ పని అయిపోయింది.
వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం
టిడిపి వచ్చిన ఏడాదిలోగా తాగునీటి పథకం పూర్తి చేస్తాం.
ప్రతిపాదనల్లో ఉండిపోయిన బ్రిడ్జి పూర్తి చేస్తాం.
చిత్తూరు జిల్లా కేంద్రంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం
చిత్తూరు యూనివర్సిటీ కళని చంద్రబాబు నెరవేరుస్తారు.
లోకేష్‌ని అడ్డుకుంటే యువగళం ఆగదు జగన్.`