కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
– శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్ రాళ్లను రాత్రి వేళల్లో తరలిస్తున్నారని లేఖలో ఆరోపించారు.
– అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు సీఎస్‌కు సైతం బాబు లేఖ పంపారు.
★ గత కొన్ని రోజులుగా కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది.
★ ఇదే అంశంపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పలు సందర్బాల్లో పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చినా.. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
★ ఇదే అంశంపై నేడు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
★ కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఎస్‌తో పాటు తమిళనాడు సీఎస్‌కు లేఖ రాశారు.
★ చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు.
★ కుప్పం నుంచి తమిళనాడులోని క్రిష్ణగిరి, వెల్లూరు జిల్లాలకు జరుగుతున్న గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని లేఖలో చంద్రబాబు కోరారు.
★ శాంతిపురం, కుప్పం మండలాల్లో అక్రమంగా తవ్విన గ్రానైట్ రాళ్లను రాత్రివేళల్లో తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
★ చిత్తూరు జిల్లా లోని నదిమూర్, ఓ.ఎన్ కొత్తూరు, మోట్ల చేను గ్రామాల మీదుగా తమిళనాడుకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందన్నారు.
★ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నేతల ప్రమేయంతో ఈ అక్రమ రవాణా జరుగుతోందని మండిపడ్డారు.
★ గ్రానైట్ మాఫియా ద్వారా జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాను తక్షణమే అరికట్టాలని సూచించారు.
★ రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు.
★ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకోవాలని తమిళనాడు సీఎస్‌కు సైతం చంద్రబాబు లేఖ పంపారు.