Politics

కొండగట్టు ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు

కొండగట్టు ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది.ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఆలయానికి సంబంధించి సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు రూ.100 కోట్లు మంజూరు చేశారు.
నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయడంలో విఫలమయ్యారని ఎత్తిచూపుతూ కరీంనగర్ ఎంపీ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.హిందుత్వం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే బదులు కరీంనగర్ అభివృద్ధికి ఎంపీ నిధులు తీసుకురావాలన్నారు