సభ నిర్వహించడానికి అనుమతి లేదంటూ లోకేష్ ని అడ్డుకున్న పోలీసులు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్.
జీఓ 1 ప్రకారం రోడ్ల మీద సమావేశం ఏర్పాటు చెయ్యడానికి అనుమతి లేదన్న పోలీసులు.
అందుకే ప్రత్యామ్నాయం చూపించాలి అని ముందుగానే అడిగాం.
పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ పెట్టుకోమని చెప్పారు.
పాలిటెక్నిక్ కాలేజీ సెక్రెటరీ అక్కడ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు.
అక్కడ సభ నిర్వహించుకోవాలో మీరే చెప్పండి అని డిఎస్పీ ని ప్రశ్నించిన లోకేష్.
ఎన్టీఆర్ సర్కిల్ లో సభ పెట్టుకోడానికి వీలు లేదన్న పోలీసులు.
ఎన్టీఆర్ సర్కిల్ లోనే స్టూల్ పై నిలబడి చిన్న మైక్ తో తనని కలవడానికి వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన లోకేష్.
జగన్ కి భయం అంటే ఏంటో చూపిస్తా.
సభ పెట్టుకోడానికి ఎక్కడా అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టాలి తాడేపల్లి ప్యాలస్ లో పెట్టుకోవాలా అంటూ పోలీసుల్ని ప్రశ్నించిన లోకేష్.
మైక్ లాక్కోవడానికి ప్రయత్నించిన పోలీసులు.