ఎనిగండ్ల విజయ అలియాస్ వై.విజయ తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లితండ్రులు. ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. శోభన్‌బాబు సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా చిత్రాలలో నటించింది.
Born: 8 February 1957
ఏ పాత్ర ఎలా పండించాలో
పులుసుకు బాగా తెలుసు…!
హ్యాపీ బర్త్ డే వై విజయ
హలో మై డియర్
రాంగ్ నంబర్..
గొంతుకే వింటే
ఎంత మధురం..
చెంతకే వస్తే చాలు స్వర్గం..
నీ వింత శృంగారం _
ఒకమారు చూపగ రాదా..
అలా ఒకమారేమిటి
మారుమారు మార్చి మార్చి
చూపించి జనాల్ని ఏమార్చి
‘వై’ విజయ..అంటే
సై విజయ..
అంటూ ఉర్రూతలూగించేసింది
పులుసు..
కొన్ని సినిమాల హిట్టుకు
ఆమే ప్రధాన దినుసు..!
ప్రతిభకు లేదు కొదవ..
అదంతా వ్యాంప్ పాత్రలకే
పెట్టేసింది కుదువ..
ఈ మగువ..భలే తెగువ..
సినిమా మసాలాలో
ఆమె ఇంగువ..
గొంతు కువకువ..!
కోడి రామకృష్ణ
క్లాప్ కొట్టిస్తే వై విజయ
సెట్టెక్కినట్టే..
లేదంటే ఆ సినిమా చెట్టెక్కినట్టే..
ఆ కాంబినేషన్ ఓ సెన్సేషన్
అదే పులుసు క్రియేషన్…
మంగమ్మగారి మనవడు
నల్ల రంగాకి
ఈ యాపిల్ పండు జోడు..
బాయ్యా అంటూ
అదరగొట్టింది చూడు..
దబ్బపండుగా కూడా
దబదబలాడించేసి
అడాళ్ళూ మీకు జోహార్లు
అనిపించుకున్న విజయమ్మ
లేడీస్ టైలర్ కు
ముదురు ప్రేమికురాలు..
లేటెస్టుగా ఎఫ్ 2 లో
అదరగొట్టి
ఎఫ్ 3 లో కూడా కనిపించి
ఎఫ్ 4..ఎఫ్ 5 కి కూడా
సై నా అంటే నై అనని
వై విజయ..
ఆంటీ అయినా నాటీ..
బామ్మగా మారినా
తగ్గని బ్యూటీ..!