కేంద్ర ప్రభుత్వం పంపిన 14, 15 వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లింపు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ .
రాష్ట్రంలోనే 12,918 గ్రామపంచాయతీల ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన రూ,, 8660 కోట్ల రూపాయల ను తిరిగి పంచాయితీల ఖాతాల్లో జమ చేయాలని ఆం.ప్ర.పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం గౌరవ సలహాదారులు ముల్లంగి రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిటీషన్ ఈరోజు విచారణకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు దారి మళ్ళించడం పై మండిపడ్డ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్.
వై.వి.బీ. రాజేంద్రప్రసాద్ మరియు ముల్లంగి రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వీరారెడ్డి
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ ను ప్రశ్నిస్తూ….
గ్రామాల అభివృద్ధికి, గ్రామీణ ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా వాడుకుంటుందని…
గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులను సర్పంచులకు చెప్పకుండా, వారి సంతకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమని…
అయినా గ్రామపంచాయతీల నిధులను ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని బదిలీ చేసిందని…
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు నిధులను దారి మళ్లించినా మరలా తిరిగి వెంటనే ఆ నిధులను గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేయాలి కదా అని…
మీ కేసు పై మూడు నెలలైనా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల హైకోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.