Politics

జగన్ ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హుడు.. చంద్రబాబు

జగన్ ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హుడు.. చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం* : చట్టాన్ని గౌరవిస్తామని అందరం ప్రమాణ స్వీకారం చేస్తాం.. కానీ దానికి ఆపోజిట్‍గా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు – లేని అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు – విధ్వంసానికి దిగితే కోర్టులు, ప్రజలు, మేధావులు కానీ దాన్ని కరెక్ట్ చేయలేని పరిస్థితి – పదేళ్లుపాటు హైదరాబాద్ కామన్ కేపిటల్‍గా ఉంటుందని విభజన చట్టంలో స్పష్టం చేశారు – పదేళ్ల తర్వాత ఏపీకి కొత్త కేపిటల్ వస్తుందని చెప్పారు – నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసింది – ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది – విభజన తర్వాత ఆర్నెల్లలోగా ఒక కమిటీని వేశాం – ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక ఏపీ ప్రభుత్వానికి పంపించాం – ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది – చట్టప్రకారం అమరావతిలో అన్నీ పూర్తి చేయాలి – రాజధాని అమరావతి ఎంపిక రహస్యంగా జరగలేదు – రాజధానిగా అమరావతిని మెజారిటీ ప్రజలు ఆమోదించారు – ఎంతో భక్తితో పూజలు చేసి ప్రధాని మోదీ యమునా జలం, పార్లమెంట్ మట్టి తీసుకొచ్చారు – మీ వెంట పార్లమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారు – ఫారెస్ట్ ల్యాండ్ కూడా వాడుకోవచ్చని యాక్ట్ లో పెట్టి అమరావతిని నిర్మించాం – అమరావతిని మార్చబోమని మాట ఇచ్చారు – అమరావతిని టీడీపీ కంటే బాగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? – ఆ రోజు ఓట్ల కోసం చెప్పి.. ఎన్నికల్లో గెలిచారు – ఇప్పుడు గెలిచాక చట్టానికి ఎన్ని తూట్లు పొడవాలో అన్ని పొడిచారు – చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారు – కౌన్సిల్ ఛైర్మన్ మతం, కులం పేరుతో బూతులు తిట్టారు – కౌన్సిల్‍ను రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు – మళ్లీ కొన్నాళ్లకు కౌన్సిల్ రద్దును మర్చిపోయారు – ప్రపంచంలో ఎక్కడా జరగని ప్రయోగం ఇది – 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34 వేల ఎకరాల్ని రాజధానికి ఇవ్వడం ఇదే తొలిసారి – వెయ్యి రోజులకుపైగా అమరావతి రైతాంగం పోరాడుతోంది – న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను ఇబ్బంది పెట్టారు – అమరావతి రైతులు అసరవెల్లికి వెళ్తుండగా గొడవలు చేసి పాదయాత్ర జరగకుండా ఆపేశారు – అమరావతిపై కులం పేరుతో విషం చిమ్మారు – అమరావతిలో భూమి బలహీనంగా ఉందన్నారు – ఫౌండేషన్ వేయడానికి చాలా ఖర్చవుతుందన్నారు.. అది తప్పని ప్రూవ్ అయింది – మొత్తం రాష్ట్రాన్నే నాశనం చేసే పరిస్థితికి వచ్చారు – అమరావతిని పూర్తి చేసి ఉంటే అన్ని అవసరాలు పూర్తయ్యాక 8 వేల 39 ఎకరాలు మిగిలేది.. ఇప్పుడు దాని విలువ లక్షల కోట్లలో ఉండేది – మీ పైరవీల కోసం రాజ్యసభ సీట్లు ఇచ్చారు – అమరావతిలో రోడ్లను కూడా తవ్వేస్తుంటే బాధగా ఉంది – ముఖ్యమంత్రి అక్కడే ఉంటాడు..అక్కడున్న ఇసుకంతా దోచుకుంటున్నారు – విభజన చట్టం కంటే జగన్ విధ్వంసక చర్యల వల్లే ఎక్కువ నష్టం జరిగింది – జగన్‍కు ప్రజలపై గౌరవం, కమిట్‍మెంట్ లేదు – దోచుకోవడంలో అనకొండ.. రుషికొండకు కూడా బోడిగుండు కొట్టేస్తున్నారు – ప్రజాకోర్టులో జగన్మోహన్‍రెడ్డిని దోషిగా నిలబెట్టేదాకా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది – జగన్‍కు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హత లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు