DailyDose

భవిష్యత్తులో అధిక డిమాండు కలిగిన టాప్ 5 జాబ్ టెక్నాలజీలు!

భవిష్యత్తులో అధిక డిమాండు కలిగిన టాప్ 5 జాబ్ టెక్నాలజీలు!

రోజు రోజుకీ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. దీని కారణంగా, ప్రజల అంచనాలు మరియు ఉపయోగం కూడా కాలానికి తగినట్లుగానే మారడం ప్రారంభించాయి.టెక్నాలజీ రంగంలో అభివృద్ధి ఒక్కొక్క సమయం లో ఒక్కోక్క రంగం ముందుంటుంది. రాబోయే పదేళ్లలో జాబ్ మార్కెట్లో ఎలాంటి టెక్నాలజీలు ముందంజలో ఉంటాయో ఈ పోస్ట్‌లో వివరాలు తెలుసుకుందాం.

టెక్నాలజీ రంగం లో జాబ్ ల వివరాలు ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా, మీరు టెక్నాలజీ రంగం గురించి మరియు జాబ్ ల గురించి సరియైన అవగాహనను పొందుతారు మరియు భవిష్యత్తులో మంచి జాబ్ పొందాలంటే ఏ ఫీల్డ్‌లో చదువుకోవాలో కూడా అంచనా పొందుతారు కాబట్టి పోస్ట్‌ను పూర్తిగా చదవండి. ఈ వివరాలు స్కూల్ లీవ్స్ మరియు కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే ఇక, సూటిగా జాబ్ టెక్నాలజీ ల విషయాలు చర్చించుకుందాం.

కంప్యూటర్ విజన్ మరియు ఫేషియల్ రికగ్నిషన్ మనం చెప్పే మాటను బట్టి వాయిస్ రికగ్నిషన్ ద్వారా పనిచేసే సెక్యూరిటీ ఫీచర్లు మరియు మనం చెప్పేది విని తదనుగుణంగా పనిచేసే టెక్నాలజీ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది అదేవిధంగా కంప్యూటర్‌ విజన్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఒక వ్యక్తి నుండి ఆదేశాలను తీసుకొని ఆ ఆదేశాలను ను అమలు చేసే టెక్నాలజీ లాగా, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా మీ ముఖ కవళికలను ఉపయోగించి కమాండ్‌లను గుర్తించి అమలు చేయగలదు.

5G టెక్నాలజీ:
భవిష్యత్ లో అభివృద్ధి చెందే టెక్నాలజీ లలో 5G ముఖ్య పాత్ర పోషించనుంది? హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, నమ్మకమైన వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ (వైర్‌లెస్ నెట్‌వర్కింగ్)తో ఈ 5G టెలికమ్యూనికేషన్ పరిశ్రమపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉంది. ఇంటర్ నెట్ ఆధారం గా పనిచేసే అన్ని టెక్నాలజీ ల అభివృద్ధి కీ ఈ 5G టెక్నాలజీ అభివృద్ధి ఉపయోగపడనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ:
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ రూమ్, స్మార్ట్ హోమ్, స్మార్ట్ గాడ్జెట్లు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వల్ల పనిచేస్తాయి. స్మార్ట్ టెక్నాలజీ కీ అలవాటు పడిన వ్యక్తులు దాని నుండి వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. అందువల్ల, భవిష్యత్తులో మంచి డిమాండ్ పొందే టెక్నాలజీ రంగాలలో AI మరియు మెషిన్ లెర్నింగ్ రెండూ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటాయి. రాబోయే పది, ఇరవై ఏళ్ల తర్వాత ఈ రెండు విషయాలను అధ్యయనం చేసే వారికి మరింత ఆదరణ లభిస్తుంది.


క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఎడ్జ్ కంప్యూటింగ్:
డేటా మరియు అనలిటిక్స్ రంగం ఇటీవలి కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందుతోంది. దానికి ప్రధాన కారణం క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇంటర్నెట్ సదుపాయం ఉంటే క్లౌడ్ లో నిల్వ చేసిన సమాచారాన్ని ఎక్కడైనా, ఏ పరికరాన్ని ఉపయోగించి అయినా ఉపయోగించవచ్చు. మీరు ఏ పరికరం నుండి అయినా క్లౌడ్‌లో సమాచారాన్ని నిల్వ చేయవచ్చు. దీనివల్ల ఎప్పుడైనా, ఎక్కడికెళ్లినా ల్యాప్‌టాప్‌, హార్డ్‌ డిస్క్‌ తీసుకెళ్లే వారికి ఏంటో ఉపయోగ పడుతుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా సమాచారాన్ని ప్రాసెస్ చేసే ఎడ్జ్ కంప్యూటింగ్ పద్ధతికి ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది.

క్వాంటం కంప్యూటింగ్:
చివరగా టెక్నాలజీ విషయానికి వస్తే, హై-స్పీడ్ క్వాంటం కంప్యూటర్లు భవిష్యత్తు లో క్వాంటం కంప్యూటింగ్ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ, రాబోయే పదేళ్లలోపు మొదటి క్వాంటం కంప్యూటర్‌ను మార్కెట్‌లో విక్రయించే అవకాశం ఉందని నిపుణుల వర్గాలలో నివేదికలు విడుదల చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నభవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.