Politics

హైదరాబాద్ లో నేటి నుంచి వివేకా కేసు విచారణ

హైదరాబాద్ లో నేటి నుంచి వివేకా కేసు విచారణ

హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరిగే వైఎస్ వివేకా కేసు విచారణకు హాజరు కావాలని ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశాలు పంపింది. ఇందులో ఇప్పటికే జైల్లో రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన సీబీఐ కోర్టు.. బెయిల్ పై ఉన్న మరో ఇద్దరు నిందితులుఎర్ర గంగిరెడ్డి, దస్తగిరికి సమన్లు జారీ చేసింది. దీంతో ఈ ఐదుగురు సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు. వీరంతా హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు తొలిసారి హాజరవుతున్నారు..

వివేకా కేసు సీబీఐ విచారణ మారిన నేపథ్యంలో సీబీఐ దూకుడు కూడా పెంచింది. ఇంతకాలం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ పిలిపించి ప్రశ్నించిన సీబీఐ.. ఆ తర్వాత పులివెందులకు సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ ను పిలిపించి విచారించింది. ఇవాళ సీబీఐ కోర్టు విచారణ ఆధారంగా మరిన్ని చర్యలకు సీబీఐ సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే ఈ కేసుతో తమను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల వంటి వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది