Health

నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కానీ చాలా మంది పోష‌కాహారం తిన‌డం లేదు. దీంతో అనేక వ్యాధులు వ‌స్తున్నాయి. ఇక పోష‌కాలు లోపించ‌డం వ‌ల్ల మ‌న‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. కాలి పిక్క‌లు ప‌ట్టేయ‌డం కూడా అలాంటి ఒక ల‌క్ష‌ణ‌మే. నిద్ర‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌కు ఎక్కువ‌గా ఇలా జ‌రుగుతుంది. నిద్ర‌లో ఉన్న‌ప్పుడు కాలిని పైకి ఎత్తితే ఇలా జ‌రుగుతుంది. దీంతో ఆ స‌మ‌యంలో తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీంతో నిద్ర‌కు ఆటంకం క‌లుగుతుంది. ఇలా చాలా మందికి త‌ర‌చూ జ‌రుగుతూనే ఉంటుంది.

అయితే నిద్ర‌లో ఉన్న‌ప్పుడే కాకుండా చాలా మందికి రోజులో ప‌గ‌టి పూట కూడా ఇలాగే జ‌రుగుతుంది. ఇక ఇందుకు మెగ్నిషియం లోపాన్ని ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. మెగ్నిషియం లోపించ‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. దీంతో ఎక్కువ సేపు కూర్చోలేరు. నిల‌బ‌డ‌లేరు. తిమ్మిర్లు వ‌స్తుంటాయి. అలాగే ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డుతాయి. న‌రాల మీద ఒత్తిడి ప‌డుతుంది. దీంతో ఇలా పిక్క‌లు ప‌ట్టేస్తుంటాయి. ఇలా జ‌ర‌గడానికి మెగ్నిషియం లోప‌మే ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇక మెగ్నిషియం ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఈ నొప్పులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ అద్దుతూ కాపడం పెట్టాలి. దీనివల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుని కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. కాళ్లు బాగా చాచి అటూ ఇటూ కదుపుతూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే నొప్పి నుండి ఉపశమనం ల‌భిస్తుంది.

ఇక మెగ్నిషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అంటే పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, పెరుగు, ఆకుకూరలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆనపకాయ, బూడిద గుమ్మడికాయ నొప్పులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇలాంటి నొప్పులు రావడానికి రక్తహీనతను కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి రక్తహీనత సమస్య ఉందేమో ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ర‌క్త‌హీన‌త ఉంటే అప్పుడు ఐర‌న్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే థైరాయిడ్ కూడా ఇందుకు ఒక కార‌ణం. క‌నుక ఏం చేసినా ఈ నొప్పులు పోవ‌డం లేదంటే.. థైరాయిడ్ ఉందేమోన‌ని అనుమానించాలి. ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉంద‌ని వ‌స్తే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. దీంతో కాలి పిక్క‌లు ప‌ట్టేయ‌డం త‌గ్గుతుంది.