అసలు ఏ దేశాన్ని ఎంపిక చేసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తినప్పుడు ‘‘ప్రపంచంలో జీవించడానికి అత్యంత అనువైన దేశాల జాబితా’’ పేరుతో విడుదల చేసే ర్యాంకింగ్స్ కొంతవరకు తోడ్పడుతుంటాయి. కానీ, పక్కన పిల్లలు కూడా ఉన్నప్పుడు మరికొన్ని విషయాలను కూడా మనం ఆలోచించాలి. సగటు ఆదాయం ఎంత? ఆర్థిక స్థిరత్వం ఉంటుందా? లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు పిల్లలకు మంచి ఆరోగ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యతోపాటు వారితో గడిపేందుకు తమ ఉద్యోగాలకు సెలవులు ఎక్కడ ఎక్కువ ఇస్తారు ఇలా చాలా అంశాలను మీరు తెలుసుకోవాలని భావిస్తూ ఉండొచ్చు.
పిల్లల సంరక్షణపై దేశాల వారీగా ప్రకటించే ర్యాంకింగ్స్‌లో యూనిసెఫ్ ఇవే అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. అయితే, ఇక్కడ ప్రధానంగా ధనిక దేశాలపైనే దృష్టికేంద్రీకరిస్తూ ఈ ర్యాంకులు విడుదల చేస్తున్నారు. ఆ నివేదికలో అంశాలను పరిశీలిస్తే, ప్రపంచ దేశాల్లో తమ పిల్లలు పెరిగేందుకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కొంతవరకు అవగాహన వస్తుంది.
ఈ అంశంపై మేం మరికొంత పరిశోధన చేపట్టాం. అసలు పిల్లలు పెరగడానికి అత్యంత అనుకూల వాతావరణం ఎక్కడ ఉంటుంది? అసలు ఏ దేశంలో పిల్లల భవిష్యత్ బంగారంలా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నించాం.
ఈ పిల్లలు బడికి వెళ్లరు, ఇంట్లోనే చదువుకుంటారు
డిజిటల్ నేటివ్స్: ‘స్మార్ట్ స్క్రీన్లు, డిజిటల్ పరికరాలతో.. కొత్త తరం పిల్లల ఐక్యూ తగ్గుతోంది’
జపాన్
యూనిసెఫ్ 2020 చిల్డ్రన్ వెల్‌బీయింగ్ విశ్లేషణలో పిల్లల శారీరక ఆరోగ్యంలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. శిశు మరణాలు, ఊబకాయం ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. అయితే, 2022 రిపోర్టు కార్డులో పిల్లలకు అనువైన వాతావరణంలో జపాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ పట్టణాల్లో పచ్చదనం, ట్రాఫిక్ సేఫ్టీ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
పిల్లల ఊబకాయంలో అధికంగా ఉండే దేశాల్లో జపాన్ అట్టడుగున ఉంది. మరోవైపు శిశు మరణాలు కూడా ఇక్కడ తక్కువగా ఉన్నాయి. పిల్లలపై ప్రభావం చూపించే వాయు లేదా నీటి కాలుష్యం కూడా ఇక్కడ చాలా తక్కువ.
మరోవైపు కుటుంబాలకు అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో జపాన్ కూడా ఒకటి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు తక్కువ. నేరాల రేటు అయితే, యూనిసెఫ్ పరిశీలించిన దేశాల్లో జపాన్‌లోనే అతి అతిక్కువ(ప్రతి లక్ష మందికి 0.2 నేరాలు). అమెరికా (5.3), కెనడా (1.8), ఆస్ట్రేలియా (0.8)ల కంటే ఇక్కడే నేరాలు తక్కువ.
ఝార్ఖండ్: పరీక్షల్లో ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు
‘‘నేరాలు తక్కువగా ఉండటంతో కుటుంబాలు హాయిగా జీవించొచ్చు. అంతేకాదు, పిల్లలు కూడా స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు’’అని లండన్‌లో జీవించే టోక్యోకు చెందిన మామి మెక్‌క్యాగ్ చెప్పారు.
‘‘అక్కడ ఆరేళ్ల నుంచే పిల్లలు సొంతంగా స్కూలుకు వెళ్లిపోతుంటారు. అయితే, బస్సు లేదా ట్రైన్ లేదంటే నడుచుకుంటూ హాయిగా వెళ్తారు’’అని ఆమె వివరించారు. ‘‘టోక్యో నగరం మధ్యలోనూ పిల్లలు హాయిగా తిరుగుతూ కనిపిస్తారు. ఆ మధ్యలోనుంచే స్కూలు బ్యాగులతో వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ భద్రత ఆ స్థాయిలో ఉంటుంది. పిల్లల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు’’అని ఆమె అన్నారు.
ఆరోగ్యం, భద్రత విషయంలో ముందుండటంతోపాటు ఇక్కడ ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. విద్యా వ్యవస్థలపై ఓఈసీడీ పరిశీలించిన 76 దేశాలు, ప్రాంతాల జాబితాలో జపాన్ 12వ స్థానంలో ఉంది. ఇక్కడ తల్లిదండ్రులకు పెయిడ్ పేరెంటల్ లీవ్ కూడా ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొత్తంగా దాదాపు 12 నెలలు ఈ లీవ్ ఇస్తారు. పురుషులకు కూడా ఈ సెలవులు ఇచ్చేలా జపాన్ ప్రోత్సహిస్తోంది.
11 ఏళ్ల హరిప్రియ ఐక్యూ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కన్నా ఎక్కువ.. అసలు ఐక్యూ అంటే ఏమిటి? దీనిని ఎలా కొలుస్తారు?
ఐక్యూ తక్కువని వైద్యులు చెప్పారు… ఆ అమ్మాయే ఒలింపిక్స్ పతకాలు తెచ్చింది
ఎస్టోనియా
మొత్తంగా చూసుకుంటే యూనిసెఫ్ ర్యాంకింగ్స్‌లో ఎస్టోనియా మొదటి స్థానాల్లో ఉండకపోవచ్చు. కానీ, కొన్ని ప్రధానమైన అంశాల్లో ఇక్కడ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి.
పిల్లలపై ఇక్కడ కాలుష్య ప్రభావం చాలా తక్కువ. శబ్ద కాలం కూడా అంతే. పురుగుల మందుల వాడకంలో ధనిక దేశాల్లో ఎస్టోనియా చివరన ఉంటుంది. అమెరికా, కెనడా, ఆస్రేలియాతోపాటు చాలా దేశాల కంటే, ఇక్కడి పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ప్లేగ్రౌండ్‌లను ఇక్కడ పిల్లలు హాయిగా ఆస్వాదించొచ్చు.
తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ధనిక దేశాల జాబితాలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఎస్టోనియా ఉంటుంది. మంచి మాతృత్వ, గర్భిణి సంరక్షణ విధానాలకు ఇది సూచికగా చెప్పుకోవచ్చు.
బాలబాలికల మధ్య సమానత్వ భావనను పెంచడం కోసమే అంటున్న స్కూలు యాజమాన్యం
ఎస్టోనియా విద్యా వ్యవస్థ గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడి పిల్లలు గణితం, సైన్స్‌లో ఆసియా దేశాలన్నింటికంటే ముందుంటారు. డిజిటల్ నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ‘‘కిండర్‌గార్టెన్స్‌లో రోబోలు, స్మార్ట్ ట్యాబ్లెట్లతో పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు’’అని ఎస్టోనియా ఎడ్యుకేషన్ అండ్ యూత్ బోర్డులో ప్రాజెక్టు మేనేజర్ అన్నే మాయి మీసక్ చెప్పారు.
రోబోటిక్స్, రీడింగ్ నైపుణ్యాలతోపాటు సోషల్-ఎమోషనల్ స్కిల్స్‌లోనూ ఎస్టోనియాలో ఐదేళ్ల పిల్లలు చాలా మెరుగ్గా ఉంటున్నట్లు ఓఈసీడీ తాజా నివేదిక అంచనా వేసింది. అమెరికా, బ్రిటన్‌లో కంటే ఇక్కడి పిల్లలు తోటివారిలోని భావోద్వేగాలను గుర్తించడం, వారికి సాయం చేయడం లాంటివి ఎక్కువగా చేస్తుంటారని తెలిపింది.
ఇక్కడ చాలా దేశాల కంటే మెరుగైన ఫ్యామిలీ లీవ్ విధానం ఉంది. మొదటగా 475 రోజుల పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇస్తారు. వీటిని చిన్నారి మూడేళ్ల వయసులోపు తీసుకోవచ్చు. వీటికి అదనంగా 100 రోజుల మెటర్నిటీ, 30 రోజుల పెటర్నిటీ లీవ్‌లు ఇస్తారు. మొదటి 60 రోజులు భార్యభర్తలు ఇద్దరు ఒకేసారి సెలవులు తీసుకోవచ్చు. ఇద్దరికీ వెతనం కూడా చెల్లిస్తారు. మరోవైపు చిన్నారి 14 ఏళ్ల వయసు వచ్చేవరకు ఏడాదికి పది రోజులు పెయిడ్ పేరెంటల్ లీవ్ ఇస్తారు.
అవునా.. 1975కు ముందువారితో పోలిస్తే మన తెలివి తక్కువేనా?
స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల తెలివితేటలు పెరుగుతాయా? తగ్గుతాయా?
స్పెయిన్
పిల్లల చుట్టుపక్కల వాతావరణంలో స్పెయిన్ తొలి స్థానంలో ఉంటుంది. ఇక్కడ వాయు లేదా నీటి కాలుష్యంతో సంభవించే మరణాలు చాలా తక్కువ. మొత్తంగా చూస్తే సామాజిక, విద్య, ఆరోగ్య సేవల్లో మొదటి వరుసలో లేనప్పటికీ, పిల్లల సంరక్షణలో స్పెయిన్‌కు మంచి మార్కులే వేసింది యూనిసెఫ్. పిల్లల మానసిర ఆరోగ్యంలో దేశానికి మూడో ర్యాంకు, విద్యా, సామాజిక నైపుణ్యాల్లో నాలుగో ర్యాంకు వచ్చాయి. తేలిగ్గానే తమకు తోటివారు మిత్రులవుతున్నారని చెప్పే పిల్లల వాటా ఇక్కడ 81 శాతం వరకు ఉంది. మరోవైపు యువత ఆత్మహత్యల రేటు ధనిక దేశాల్లో స్పెయిన్‌లోనే అతి తక్కువ. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల కంటే ఆత్మహత్యలు రేటు ఇక్కడ చాలా తక్కువ.
స్పెయిన్ సంస్కృతి పిల్లలను తమలో కలిపేసుకుంటుందని 15 ఏళ్ల క్రితం మ్యాడ్రిడ్ నుంచి షికాగోకు వచ్చిన లోరి జియానో చెప్పారు. ‘‘అక్కడ పిల్లలను రెస్టారెంట్లు, బార్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అర్ధరాత్రిపూట పిల్లలను వెంట పెట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జంటలు మనకు కనిపిస్తుంటాయి. అక్కడి పిల్లలు ఇతరులు ఏమనుకుంటున్నారో పెద్దగా పట్టించుకోరు. అందరూ సంతోషంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు’’అని ఆమె వివరించారు.
ఇక్కడ కూడా పేరెంటల్ లీవ్ విధానం అమలులో ఉంది. తల్లి, తండ్రి ఇద్దరికీ 16 వారాల పెయిడ్ లీవ్ ఇస్తారు. ఆ తర్వాత కావాలంటే తల్లి మూడేళ్ల వరకు అన్‌పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. లేదా తక్కువ గంటలు పనిచేస్తానని కూడా చెప్పొచ్చు.
మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్.. ఆ సొరచేప కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక
ఫిన్‌లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
ఫిన్‌లాండ్
యూనిసెఫ్ తాజా రిపోర్ట్ కార్డులో మొత్తంగా ర్యాంకింగ్‌లో ఫిన్‌లాండ్ ఐదో స్థానంలో ఉంది. ‘‘వరల్డ్ ఆఫ్ ది చైల్డ్’’ విభాగంలో మొదటి స్థానం ఈ దేశానిదే. చుట్టుపక్కల వాతావరణం పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో దీనిలో అంచనా వేస్తారు. ‘‘వరల్డ్ అరౌండ్ ద చైల్డ్’’ విభాగంలో ఇది రెండో స్థానంలో ఉంది. స్కూళ్లు, ట్రాఫిక్, పచ్చని మైదానాల్లో పిల్లలు ఎలా ఉంటున్నారనే అంశాలను దీనిలో పరిగణలోకి తీసుకుంటారు.
పిల్లల చదువు, గణితం నైపుణ్యాల్లో ప్రపంచ దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ మొదటి వరుసలో ఉంటుంది. స్కూల్‌లో సిబ్బంది తమతో మాట్లాడే విధానం ఇక్కడ ఎంతో మెరుగ్గా ఉంటుందని తల్లిదండ్రులు చెబుతుంటారు.
5 నుంచి 14 ఏళ్ల మధ్య బాలల మరణ రేటు ఫిన్‌లాండ్‌లోనే అతితక్కువ. ఈ రేటు అమెరికాలో సగం ఇక్కడ మనం గమనించొచ్చు.
కంటిచూపు కోల్పోతారని తెలిసి ఆ తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేశారు?
పేరెంటల్ లీవ్ విధానం ఇక్కడ కూడా అమలులో ఉంది. ఎనిమిది వారాల పెయిడ్ మెటర్నిటీ లీవ్ ఇస్తారు. ఆ తర్వాత మరో 14 నెలల పెయిడ్ పేరెంటల్ లీవ్‌ను భార్యా, భర్తలు కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. చిన్నారి మూడో ఏడాది వచ్చేవరకు అదనపు సెలవులకు కూడా అర్జీ పెట్టుకోవచ్చు.
బ్రిటన్‌కు చెందిన హెడ్లీ డీన్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబంతోపాటు పోలండ్, చెక్ రిపబ్లిక్, ఫిన్‌లాండ్‌లోనూ గడిపారు. ‘‘ఫిన్‌లాండ్‌లో పచ్చదనం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాజధాని హెల్సింకీ చుట్టుపక్కల ఇది చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పచ్చదనం చాలా సహజంగా ఉంటుంది. నగరం మధ్యలో అడవిలా మనకు కనిపిస్తుంది. ఇలాంటి చోట గడిపితే యాంక్సైటీ, డిప్రెషన్ తగ్గుతాయని చాలా అధ్యయనాల్లో తేలింది’’అని డీన్ చెప్పారు.
మరి శీతాకాలం సంగతేంటి? ‘‘కొన్నింటిని భరించినా ఫర్వాలేదని అనిపిస్తుంది. మీకు అలవాటు అయిపోతుంది. వాతావరణానికి అనుగుణంగా బట్టలు వేసుకుంటారు. అదే వేసవిలో అయితే, అద్భుతంగా ఉంటుంది. రోజులో 22 గంటలు సూర్యరశ్మి మీకు కనిపిస్తుంది’’అని ఆయన వివరించారు.
మీ పిల్లలు అసాధారణ ప్రజ్ఞావంతులని గుర్తించడం ఎలా… వండర్ కిడ్స్ అంటే ఎవరు?
కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’
నెదర్లాండ్స్:
మొత్తంగా పిల్లల సంరక్షణలో నెదర్లాండ్స్ మొదటి స్థానంలో ఉంది. పిల్లల మానసిక ఆరోగ్యం (మొదటి స్థానం), నైపుణ్యాలు (మూడో స్థానం)కూడా ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి.
ప్రతి పది మందిలో తొమ్మిది మంది 15 ఏళ్ల పిల్లలు జీవితంపై తాము సంతృప్తికరంగా ఉన్నామని ఇక్కడ చెబుతున్నారు. ఈ విషయంలో మిగతా దేశాల కంటే నెదర్లాండ్స్ చాలా ముందుందని యూనిసెఫ్ చెబుతోంది. మరోవైపు ప్రతి పది మందిలో ఎనిమిది మంది తమకు తేలిగ్గానే తోటివారు మిత్రులు అవుతున్నట్లు చెబుతున్నారు.
‘‘ఇక్కడ సంస్కృతి అందరినీ సాధారణంగా జీవించాలని సూచిస్తుంది. దీన్నే డచ్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథ్తింగ్ అంటారు. సాధారణంగా ఉండటమే చాలా క్రేజీగా ఉంటుందని ఇక్కడ చెబుతారు. ఇది పిల్లలపై చాలా ఒత్తిడి తగ్గిస్తుంది. సామాజిక సంబంధాలకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు’’అని నెదర్లాండ్స్‌లో ముగ్గురు పిల్లలతో 13 ఏళ్లు జీవించిన పోలండ్ వాసి ఓల్గా మెకింగ్ చెప్పారు.
అయితే, పిల్లలు, కుటుంబాలు సంతోషంగా జీవించడానికి కొన్ని వ్యవస్థాగత ఏర్పాట్లు కూడా కారణమని ఆమె వివరించారు. ‘‘డచ్ వేల్ఫేర్ వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులకు చాలా మద్దతు లభిస్తుంది’’అని ఆమె చెప్పారు. దీనికి ఫ్యామిలీ లీవ్ పాలసీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మహిళలకు 16 వారాల మెటర్నిటీ లీవ్ ఇస్తారు. పురుషులు ఆరు వారాల పెయిడ్ పెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. చిన్నారి ఎనిమిదేళ్ల వయసుకు వచ్చేవరకు అన్‌పెయిడ్ పేరెంటల్ లీవ్ కోసం అర్జీలు పెట్టుకోవచ్చు.