నంబరు ప్లేటు మార్చి కుటుంబసభ్యులతో షికారు
మరో వాహనాన్ని ఢీకొనడంతో బయటపడిన బండారం
ఆయనో డివిజన్ స్థాయి పోలీసు ఉన్నతాధికారి. ప్రభుత్వం కల్పించిన వాహన సదుపాయాలు ఉంటాయి. కానీ ఓ గంజాయి నిందితుడి కారులో కుటుంబ సభ్యు లతో షికారుకు వెళ్లడం వివాదానికి దారి తీసింది. పైగా అదే కేసులో పట్టుబడిన మరో కారు నంబరు ప్లేటును తీసి దానికి అమర్చడం.. సీజ్ చేసిన వాహనాన్ని సొంతానికి వాడుకోవడం విశేషం. ఇలా ఒక నిందితుడి కారుకు మరో నిందితుడి కారు నంబరు ప్లేటు అమర్చి విశాఖ బీచ్ కు షికారెళ్లిన ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
ఇదీ జరిగిన కథ..
అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో గత ఏడాది జులైలో గంజాయి తరలిస్తున్న నిందితులు కొందరు పోలీసులను చూసి కారు వదిలి పారిపో యారు. కశింకోట పోలీసులు ఆ కారు (ఏపీ31 బీఎన్ 1116)ను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అది జి.మాడుగులకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టరై ఉంది. రాజస్థాన్ కు చెందిన సింగ్ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పోలీసులు పిలవడంతో గతేడాది నవంబరు 11న అతడు కశింకోట స్టేషన్కు వచ్చాడు. విచారించి అతడిని అరెస్టు చేశారు. అతడు తాను వేసుకువచ్చిన కారును తన తల్లికి అప్పగించాలని కోరాడు. అయితే ఆమె రాజస్థాన్ వెళ్లిపోయారని ఆ తెలిసి ఆ కారును అనకా పల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అప్పటి నుంచి పోలీసులు దానిని తమ అవసరాలకు వాడు కుంటున్నారు. ఈ క్రమం లోనే ఈ నెల 1న డీఎస్పీ సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారు తీసుకుని విశాఖపట్నం వెళ్లారు. బీచ్ రోడ్డులో ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో మొత్తం వ్యవహారం వ్యవహారం బయటపడింది. అయితే ప్రమాదంపై DSP, అవతలి వ్యక్తి రాజీ పడటంతో కేసు నమోదు కాలేదు.
ఇవి రెండు నేరాలు: ఎస్పీ
డీఎస్పీ వ్యవహారంపై అనకాపల్లి ఎస్పీ గౌతమిని వివరణ కోరగా.. ‘డీఎస్పీ సునీల్ గంజాయితో పట్టుబడిన నిందితుడు సింగ్ కారులో ప్రయాణించి నట్లు మా దృష్టికి వచ్చింది. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే.. నంబరు ప్లేట్ మార్చడం మరో నేరంగా భావించిన ఉన్నతా ధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై నివేది కను వారికి పంపుతాం’ అని తెలిపారు.
వివాదాస్పదంగా DSP పనితీరు
డీఎస్పీ సునీల్ పై గతంలోనూ వివాదాలున్నాయి. సివిల్ కేసుల్లో తలదూరుస్తారని, భూవి వాదాలు సెటిల్మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కశింకోటకు చెందిన తెదేపా నాయ కుడు కాయల మురళిని ఫోన్లో బెదిరించా రంటూ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎస్పీ గౌతమికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దాని పై విచారణ జరుగుతోంది.
ఆ విషయం నాకు తెలీదు
ఈ వివాదంపై సునీల్ ను వివరణ కోరగా…’తాను అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆ కారును పంపారని’ వివరణ ఇచ్చారు. నంబరు ప్లేట్ మార్చిన విషయం తనకు తెలీదన్నారు.