NRI-NRT

ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటైంది.బ్రశీ క్రీక్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అర్జున్ అనంతుల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా పరమేష్ రెడ్డి నంగీ, కార్యదర్శిగా శివ దుర్భాకుల, కోశాధికారిగా మధుకర్ రెడ్డి గంగా నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా శైలజ కోమటి (కల్చరల్), జగన్ మల్కారెడ్డి (ఫైనాన్స్ & స్పాన్సర్షిప్), భరత్ పిస్సాయ్ (మెంబర్షిప్), గోపాల కృష్ణ అయితాబత్తుల (ఫుడ్ & లాజిస్టిక్స్), చిన్నప్ప కుందూరు (స్పోర్ట్స్), బోర్డు అఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ బత్తుల నియమితులయ్యారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న రామ్ హనుమంతు, మురళీధర్ వేలూరికి నూతన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు