ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలకృష్ణ జోరు నడుస్తుంది. ‘అఖండ’ తర్వాత అదే ఊపులో వచ్చిన ‘వీరసింహా’ బాలయ్యకు తిరుగులేని విజయాన్నిచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తొలిరోజు నుంచే సంచలనాలు క్రియేట్ చేసింది
NBK108 Movie | ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలకృష్ణ జోరు నడుస్తుంది. ‘అఖండ’ తర్వాత అదే ఊపులో వచ్చిన ‘వీరసింహా’ బాలయ్యకు తిరుగులేని విజయాన్నిచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తొలిరోజు నుంచే సంచలనాలు క్రియేట్ చేసింది. పోటీగా ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’ వంటి సినిమాలున్న మాస్ ఆడియెన్స్ బాలయ్య సినిమాకే ఓటేశారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య తాజాగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చాడట. ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేద్దామా అంటూ తొందరపడే బాలయ్య ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారట.
అయితే షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వడానికి బాలయ్యకు ఓ ప్రధాన కారణం ఉందట. అదేంటంటే.. నందమూరి తారకరత్న ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పోందుతున్నాడు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిని బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఈ క్రమంలో షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ‘NBK108’ కూడా కాస్త లేట్‌గా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై బాలయ్య క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న NBK108 సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఫాదర్-డాటర్ సెంటిమెంట్‌తో సాగనున్న ఈ సినిమాలో పెళ్లిసందడి ఫేం శ్రీలీలా బాలయ్య కూతురులా నటించింది. ఈ సినిమాలో బాలయ్య 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో నటించనున్నాడు.