Politics

30 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

30 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

పనితీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్​ ఇచ్చేది లేదు : సీఎం జగన్​

ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే నివేదిక

30 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారు

ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు మెరుగుపరచుకోని వారిపై ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం ఎమ్మెల్యేల పని తీరుపై చేసిన సర్వే నివేదికను ప్రదర్శించారు.
30 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, పని తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్‌ మోహన్​ రెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఎమ్మెల్యేల పని తీరుపై చేసిన సర్వే నివేదికను ప్రదర్శించారు. పని తీరు మెరుగుపరచుకోని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగిన పలువురు ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించారు.
కార్యక్రమ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. మార్చి 18 నుంచి ‘మా భవిష్యత్తు నువ్వే జగన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈలోగా కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పలు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని.. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు.స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్​​పైన సీఎం దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో కార్యక్రమం నిర్వహణపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్న జిల్లాలు మినహా.. మిగతా అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని సీఎం జగన్​ దిశా నిర్దేశం చేశారు.