మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు. ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను” అని వారితో
వెయ్యిసార్లు రాయించారు. ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టంచేశారు.