వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60కి మించి సీట్లు రావని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy) అన్నారు.కాంగ్రెస్ (Congress)తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాదని కాంగ్రెస్ (Congress) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy) అన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.“వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో కేసీఆర్ కలవక తప్పదు.కాంగ్రెస్లో అందరం కష్టపడితే 40-50 స్థానాలు వస్తాయి. అధికారంలో కాంగ్రెస్ ఉండటం ఖాయం. పాదయాత్ర
రూట్ మ్యాప్పై పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకుంటా. నేను స్టార్ క్యాంపెయినరు.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతాను? మార్చి మొదటి వారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తా. నేను గెలిపిస్తా అంటే.. మిగిలిన వారు ఇంట్లో ఉంటారు” అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.