ప్రధాని మోదీ(Modi) చురుకుదనం చూసి అబ్బురపడ్డారు జెరోదా సహవ్యవస్థాపకుడు నితిన్ కామత్. ఇప్పుడు ఆయన మోదీని కలిసిన తర్వాత కొత్త లక్ష్యాన్ని సెట్ చేసుకున్నారు.
బెంగళూరు: 72 ఏళ్ల వయస్సులో కూడా ప్రధాని మోదీ(Modi) చురుగ్గా పనిచేస్తున్నారని.. తాను ఆ వయసుకు వచ్చేసరికి ఆయనలా ఉత్సాహంగా ఉండటమే తనముందున్న లక్ష్యమన్నారు నితిన్ కామత్( Nithin Karnath ).ప్రధానిని కలిసిన తర్వాత తాను ఈ కొత్త లక్ష్యాన్ని సెట్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మోదీతో దిగిన చిత్రాన్ని నెట్టింట్లో షేర్ చేశారు. ఈ వ్యాపారవేత్త.. ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థ జెరోదా(Zerodha) సహవ్యవస్థాపకుల్లో
ఒకరు.
‘ప్రధాని మోదీని కలుసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆయన్ను కలిసిన తర్వాత నా ఆరోగ్యం గురించి కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేను 72ఏళ్ల వయస్సులో.. ఆయనలాగా చురుగ్గా పనిచేయగలగాలి. రోజు మొత్తం ఎన్నో ప్రయాణాలు, సమావేశాల్లో పాల్గొని కూడా.. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత కూడా మాతో 30 నిమిషాలు మాట్లాడారు’ అని నితిన్ కామత్ ట్వీట్ చేశారు.
నితిన్ తో పాటు ఆయన సోదరుడు నిఖిల్ కామత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన కూడా మోదీతో దిగిన చిత్రాన్ని షేర్ చేశారు. ఈ చిత్రాలు నెట్టింట్లో షేర్ చేయగా.. లెజెండ్స్ అంతా ఒకే చిత్రంలో అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.బెంగళూరు(Bengaluru) లో సోమవారం జరిగిన 14వ ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా ఆదివారమే మోదీ కర్ణాటకకు చేరుకున్నారు. కన్నడ స్టార్ హీరోలు యశ్, రిషబ్ శెట్టి, ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అయ్యో శ్రద్ధా (Aiyyo Shraddha) తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.