ఎన్నారై హస్టెండ్స్ తమ భార్యలను కట్నం కోసం హింసించడం, లేదా మరే ఇతర కారణంగానైనా వదిలేయడం వంటివి ఇప్పటికే చాలా వెలుగు చూశాయి. కొందరు మహిళలు ఎన్నారైలను పెళ్లి చేసుకొని హాయిగా జీవితంలో సెటిల్ అవుతుంటే మరికొందరి పెళ్లి జీవితం మాత్రం మూడు నెలల ముచ్చటగానే మారుతోంది.
భారతదేశంలోని లూథియానాకి చెందిన 41 ఏళ్ల సర్వీందర్ కౌరికి కూడా ఇలాంటి పరిస్థితి
ఎదురయ్యింది. ఆమె ఎన్నారై భర్త తనని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే వదిలించుకున్నాడు.
దాంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ మహిళ చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే భాగస్వాములు విడిచిపెట్టిన వధువులు, వరులకు తగిన న్యాయం చేయడంలో సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది.
“హనీమూన్ వధువుల” సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఆమె ‘అబ్ వహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ని స్థాపించింది. పెళ్లి అయిన వెంటనే వారి NRI (నాన్-రెసిడెంట్ ఇండియన్) భర్తలు విడిచిపెడితే వారిని హనీమూన్ బ్రైడ్స్ అంటారు.
ఒక న్యూస్ మీడియా రిపోర్ట్ ప్రకారం, 2015 – 2019 మధ్య కాలంలో భారత ప్రభుత్వానికి వారి
భర్తలు విడిచిపెట్టిన మహిళల నుంచి 6,000 ఫిర్యాదులు వచ్చాయి, అయితే ఇది పెద్ద సమస్యలో కొంత భాగం మాత్రమే. సర్వీందర్ తనకు వివాహమై తన భర్త విడాకులు కోరి విడిచిపెట్టిన తర్వాత ఎన్జీవోనుప్రారంభించింది. ఎవరి మద్దతు లేనప్పటికీ, ఆమె 2016లో NGOని ప్రారంభించింది. పంజాబ్అంతటా 500 మందికి పైగా సహాయం చేసింది.
పోలీసుకు ఫిర్యాదులు ఇవ్వడం, వ్యాజ్యాలను దాఖలు చేయడంలో న్యాయ సహాయం, కౌన్సెలింగ్,ఇతరత్రా సహాయం అందించడం ద్వారా ఆమె బాధితులకు సహాయం చేస్తుంది.” భర్తలు విడిచి పెడితే భార్యలు పడే బాధ అనుభవించే వారికి తప్ప ఎవరికీ తెలియదు, ఆ బాధను నేను అనుభవించా,అందుకే మోసపోయిన వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తున్నానని అంటోంది సత్వీందర్