🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *15.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**
🐐 మేషం
ఈరోజు (15-02-2023)
వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేసిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (15-02-2023)
మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (15-02-2023)
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్ని విషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంభించడం మంచిది.
గోసేవ చేయడం ఉత్తమం.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (15-02-2023)
ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (15-02-2023)
మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (15-02-2023)
మంచికాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (15-02-2023)
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి పెద్దల నుంచి
సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (15-02-2023)
చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీస్తుతి చదవడం
వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (15-02-2023)
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (15-02-2023)
మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే | మనస్తత్వం మీకు గొప్పఫలితాలను తెచ్చి పెడుతుంది. దుర్గ్యానం శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (15-02-2023)
చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (15-02-2023)
మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు.
చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. దుర్గారాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈