Movies

నందమూరి బాలయ్య ఫ్యాన్స్‌కు మరో శుభవార్త..ఓకేసారి ఐదింట్లో స్ట్రీమింగ్..

నందమూరి బాలయ్య ఫ్యాన్స్‌కు మరో శుభవార్త..ఓకేసారి  ఐదింట్లో స్ట్రీమింగ్..

బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఉత్సాహంతోనే ఆయన ఆ వెంటనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రంలో నటించారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా అత్యధిక కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.

నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ మూవీకి ఊహించని రీతలో అత్యధిక కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ సినిమా ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 69 కోట్లుకు పైగా షేర్‌ను రాబట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్లు షేర్‌తో పాటు రూ. 134 కోట్లు వరకూ గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. అంతేకాదు, ఇప్పటికీ ఈ సినిమా విజయవంతంగానే ప్రదర్శితం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 23, సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ మూవీని ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, సెన్సార్ లేకుండానే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారట. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నటసింహా నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన మాస్ చిత్రమే ‘వీర సింహా రెడ్డి’. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.