Politics

చంద్రబాబుకు ప్రమాదం! కారుని ఢీ కొట్టిన వాహనం

చంద్రబాబుకు ప్రమాదం! కారుని ఢీ కొట్టిన వాహనం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చేసుచేసుకుంది. బూరుగుపూడి గ్రామ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రబాబు కారుకు ముందు ఉన్న బంపర్ వంగిపోయింది. తూర్పు గోదావరిలో చంద్రబాబు రోడ్డు షో చేస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు ముందుకు అకస్మాత్తుగా మరొక వాహనం వచ్చింది. అతివేగంగా చంద్రబాబు కారు ముందుకు వచ్చి.. ఢీ కొడుతూ వెళ్లిపోయింది. అనంతరం ఆ కారు డ్రైవర్ కాస్తా దూరం వెళ్లిన తరువాత పక్కకు నిలిపాడు. అయితే ఈ ఘటనతో చంద్రబాబు భద్రతకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కారు ముందు నుంచి చంద్రబాబు వాహన శ్రేణితో వచ్చిందా? లేకుంటే అనుకోకుండా వచ్చిందా? అని తెలియాల్సి ఉంది. బుధవారం చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిపోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాసేపు ఓపెన్ టాప్ లో ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం ఓపెన్ టాప్ కారు దిగి.. మరో ప్రత్యేక వాహనంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. ఈ రోడ్డు షో చేస్తున్న సమయంలోనే వేరే కారు అకస్మాత్తుగా చంద్రబాబు కారు ముందుకు వచ్చి ఢీ కొడుతూ ముందుకు వెళ్లింది. చంద్రబాబుకు పెనుప్రమాదం తప్పడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.