Business

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా అయితే అప్రమత్తంగా ఉండండి..

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా  అయితే అప్రమత్తంగా ఉండండి..

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్రెడిట్ కార్డ్ యూజర్లపై మరింత భారాన్ని మోపింది. క్రెడిట్ కార్డకు సంబంధించిన ఫీజును సవరిస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తాజాగా ప్రకటించింది. కొత్త ఫీజులు మార్చి 17 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు వినియోగదారులకు మెసేజ్లు, మెయిల్స్ పంపించింది.

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రెంట్ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును రూ.199లకు పెంచింది. ఇది ఇంతకు ముందు రూ.99 ఉండేది. రెంట్ చెల్లింపులపై గతేడాది నవంబర్ లోనే రూ. 99లు చేసిన ఎస్బీఐ తాజా మళ్లీ పెంచింది. దీనికి 18 శాతం జీఎన్డీ అదనం. సింప్లీ క్లిక్ కార్డకు సంబంధించిన అనేక నిబంధనలను ఈ ఏడాది జనవరిలో ఎస్బీఐ కార్డ్స్ అండ్
పేమెంట్ సర్వీసెస్ సవరించింది. పలు పరిమితులు విధించింది. వోచర్లు, రివార్డ్ రిడెన్షన్లకు సంబంధించి మార్పులు చేసింది.
జనవరి 6 తర్వాత వచ్చిన మార్పుల ప్రకారం సింప్లీ క్లిక్ కార్డ్ హోల్డర్లు గరిష్ట ఆన్లైన్ స్పెండింగ్లు చేరుకున్నాక ఇచ్చే క్లియర్ ట్రిప్ వోచర్లను ఒకే ట్రాన్సాక్షన్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇతర ఆఫర్లతో కలిపి వినియోగించుకునేందుకు ఆస్కారం లేదు. ఇక అమెజాన్లో ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల వినియోగంలో కూడా నిబంధనలు జనవరి 1 నుంచి మారాయి.
(నోట్ : ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: వడ్డీ బాదుడు షురూ!)