Devotional

ఇలాంటి శనిత్రయోదశి మహాశివరాత్రిని చూడాలంటే 144 ఏళ్ళు ఆగాల్సిందే… ఎంతో పుణ్యం చేస్తే గాని దొరకని అదృష్టం వదులుకోవద్దు…

ఇలాంటి శనిత్రయోదశి మహాశివరాత్రిని చూడాలంటే 144 ఏళ్ళు ఆగాల్సిందే… ఎంతో పుణ్యం చేస్తే గాని దొరకని అదృష్టం వదులుకోవద్దు…

ఈ మహా శివరాత్రి 144 ఏళ్ళ తర్వాత వస్తున్న శనిత్రయోదశి మహా శివరాత్రి : హిందువుల పవిత్రమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఆ ముక్కంటికి ఆరోజున పూజలు చేస్తే చేసిన పాపాలు తొలగడమే కాకుండా మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం హిందువులు క్యాలెండర్ కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటారు.
మహా శివరాత్రి రోజున శివుడు ఒక మహాలింగ రూపంలో ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు.

అందుకే ఇంత పవిత్రమైన రోజున ఈశ్వరుడి దర్శనం తప్పక చేసుకోవాలి అంటున్నారు పండితులు. ముఖ్యంగా రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. ఈసారి ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం మహా శివరాత్రి ఫిబ్రవరి 18న శనివారం వచ్చింది. అయితే ఈసారి శివరాత్రికి అనేక విశిష్టతలు ఉన్నాయి.ఈసారి మహా శివరాత్రి ప్రతి ఏడాది వచ్చే శివరాత్రి లాంటిది కాదు అంటూ పండితులు చెబుతున్నారు. పన్నెండు పుష్కరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి ఈ సారి రానుందని, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ శివరాత్రి కి శివయ్య దర్శన భాగ్యం కలుగుతుందంటూ చెబుతున్నారు.ఈ సారి శివరాత్రి శనివారం నాడు అది కూడా శని త్రయోదశి రెండూ కలిసి రావడం మరో విశేషం. ఇక శివరాత్రి ఈ సారి ఉత్తరషాడ నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రం లలో శివరాత్రి రాబోతుందడం మరో విశేషం. ఉత్తరషాడ నక్షత్రంకు అధిపతి రవి కాగా, శ్రావణ నక్షత్రం కు అధిపతి చంద్రుడు అవడం వల్ల శివరాత్రి రోజున శివయ్యకు ఆరాధన
చేస్తే మానసిక సమస్యలు అలాగే మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యలు దూరమవుతయంటూ పండితులు సూచిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినంనాడు కనీసం శివలింగం దర్శనం చేసుకున్నా మంచి ఫలితం ఉంటుందని మళ్ళీ 144 ఏళ్లకు గాని ఎలాంటి శివరాత్రి మళ్ళీ రాదంటూ చెప్తున్నారు.