Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *16.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (16-02-2023)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. భాగ్య స్థానమునందు బుధ, శుక్రుల అనుకూల స్థితి వలన చేసే ప్రతి పని కలిసివచ్చును. ఆర్ధికపరమైన లాభములు, సౌఖ్యము కలుగును. ఆయు స్థానమునందు రవి, ప్రభావంచేత ఆరోగ్య విషయము నందు జాగ్రత్తలు వహించాలి. సూర్యారాధన చేయడం మంచిది. దశమ స్థానమునందు శని ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండును. వ్యయస్థానమునందు గురుని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. జన్మస్థానమునందు రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మేష రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (16-02-2023)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. జన్మరాశి యందు కుజుడు, వ్యయ స్థానము రాహువు, అష్టమస్థానము బుధ శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానమునందు రవి ప్రభావంచేత కుటుంబమునందు వాదనలు, సమస్యలతో కూడినటువంటి వాతావరణం ఉండును. మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. వృషభ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు. వృషభరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించాలి
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (16-02-2023)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి వ్యయస్థానము యందు కుజుని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. కళత్ర స్థానమునందు బుధ, శుక్రుల ప్రభావంచేత ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. సౌఖ్యమును పొందెదరు. అష్టమ శని ప్రభావంచేత పనులయందు చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. బుధ, శు క్రుల అనుకూలత వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మిథున రాశి వారికి ఈ రోజు ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మిథున రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (16-02-2023)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. లాభములో కుజుని ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. కళత్ర స్థానము శని సంచరించుట వలన కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ రోజు కలిసి వచ్చును. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (16-02-2023)

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సింహరాశివారికి గ్రహములన్నీ అనుకూలంగా ఉండటం చేత ప్రతీ పనియందు విజయాలు పొందెదరు. అనేక సమస్యలను పరిష్కరించెదరు. అష్టమ గురుని ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. కుజుని అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉ ద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటిరోజు. సింహరాశి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించండి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (16-02-2023)

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ద్వితీయ స్థానమునందు కేతువు ప్రభావంచేత బేధాభిప్రాయములు ఆవేశపు నిర్ణయములు ఏర్పడును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన విజయం పొందెదరు. తృతీయస్థానము నందు రవి అనుకూలించును. చతుర్ధ స్థానమునందు బుధ, శుక్రుల ప్రభావంచేత ధనలాభము, సౌఖ్యము కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. శని , గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (16-02-2023)

తులారాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కేతువు, అష్టమ కుజుడు , అర్ధాష్టమ శని ప్రభావంచేత చేసే ప్రతీ పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (16-02-2023)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. జన్మరాశి యందు రవి, కళత్రమునందు కుజుడు, ప్రభావం చేత ఈ రాశి వారికి కుటుంబమునందు చికాకులు సమస్యలు, ఆరోగ్యమునందు సమస్యలు ఏర్పడును. ధనస్థానమునందు బుధ, శుక్రుల ప్రభావంచేత వృశ్చిక రాశి వారికి ధనలాభము కలుగును. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (16-02-2023)

ధనూ రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. వ్యయస్థానమునందు రవి, ద్వితీయ స్థానమునందు శని ప్రభావంచేత ఆర్ధికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ధనురాశి వారికి పనులయందు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికి పూర్తి చేసెదరు. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి శని ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (16-02-2023)

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. లాభ స్థానములో రవి ప్రభావంచేత పనులయందు లాభమును పొందెదరు. వ్యయస్థానమునందు బుధ, శుక్రుల ప్రభావం ఖర్చులు అధికమగును. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. పనులయందు ఇబ్బందులు ఆటంకములు ఏర్పడును. కష్టపడాల్సినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దత్తాత్రేయుని పూజించండి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (16-02-2023)

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్తమునుండి అనుకూల ఫలితాలున్నాయి. దశమ స్థానములో బుధ, శుక్రుల ప్రభావంచేత ఉ ద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ వారం కలసి వచ్చును. ద్వితీయ స్థానమునందు గురుడు కుంభరాశివారికి ఆర్ధికపరంగా అనుకూలించును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ఈ రోజు గోచార స్థితి వలన శు భఫలితాలు కనబడుతున్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్యము అనుకూలించును. కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ఈ రోజు దశమ స్థానములో ఉన్న గ్రహాల అనుకూల స్థితి వలన మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగును. స్త్రీలకు ఈవారం అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు కలసి వచ్చును. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించండి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (16-02-2023)

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. మీనరాశి వారికి జన్మరాశియందు గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. పనులు యందు చికాకులు ఏర్పడును. కుటుంబమునందు సమస్యలు వేధించును. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. భాగ్య స్థానమునందు రవి అనుకూలించును. దశమ స్థానమునందు బుధ, శుక్రుల ప్రభావం చేత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. కీర్తి, సౌఖ్యము కలుగును. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈