జగ్గంపేట: తెదేపాలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు.
ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమిస్తామని చెప్పారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తెదేపా అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామని..
ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జ్లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు.
ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు.
సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు.
ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.