Politics

టీడీపీ – జనసేన పొత్తు లో కొత్త ట్విస్ట్

టీడీపీ – జనసేన పొత్తు లో కొత్త ట్విస్ట్

టీడీపీ – జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.

ఏపీ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ – జనసేన పొత్తు కొనసాగుతున్నా.. నామ్ కే వాస్తేగా ఉంది. రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. పొత్తు పైన అధికారికంగా టీడీపీ- జనసేన నుంచి అధికారిక క్లారిటీ లేదు. పవన్ తమతోనే ఉంటూ బీజేపీ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

పవన్ సైతం తాము బీజేపీతో ఉన్నామని చెబడుతున్నారు. టీడీపీతో కలవటానికి బీజేపీ సిద్దంగా లేదు. కానీ, 2014 తరహాలోనే మూడు పార్టీలు కలవాలని టీడీపీ – జనసేన కోరుకుంటున్నాయి. కానీ, ఢిల్లీ కేంద్రంగా కొత్త స్కెచ్ అమలు అవుతోంది. ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ప్రభావం పడే ఆపరేషన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ – జనసేన పొత్తు ఖాయమే..అయినా ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు ఖాయంగానే కనిపిస్తోంది. కానీ, టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా కొంత క్లారిటీ లోపిస్తోంది. రెండు పార్టీల పొత్తు ఖాయమైందని వార్తలు మొదలైన తరువాత పవన్ కల్యాణ్ తమకు బీజేపీతో పొత్తు కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. అటు బీజేపీ నేతలు గేమ్ మొదలు పెట్టారు. పవన్ తమతోనే ఉన్నారంటూ పదే పదే చెబుతున్నారు.

NTR గారికి అరుదైన గౌరవం… ఢిల్లీ నేతల కీలక నిర్ణయం పవన్ తాను బీజేపీతో కొనసాగేదీ లేనిదీ పవన్ చెప్పాల్సిన పరిస్థితి కల్పించారు. బీజేపీతో పొత్తు కారణంగా ఇప్పటి వరకు రెండు పార్టీలకు కలిసి వచ్చిన అంశాలు లేవు. కలిసి పని చేసిన కార్యక్రమాలూ లేవు. అటు పవన్ ఇంకా పార్టీని ఎన్నికల దిశగా సిద్దం చేయటం పైన ఫోకస్ పెట్టలేదు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నాయకత్వం పవన్ అడుగులను గమనిస్తోంది. పవన్ తో పొత్తు పైన ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు.

కన్నా లాంటి సీనియర్ ను వదులుకున్న జనసేన..

సీనియర్ రాజకీయ నేతల్లోనూ టీడీపీ – జనసేన పొత్తు విషయంలో ఏదైనా జరగచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తొలి నుంచి జనసేన లో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, తాము బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నామని..బీజేపీ నేతలను ఇప్పటికిప్పుడు చేర్చుకోలేమని..మరి కొంత కాలం ఆగాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీలో చేరటం రాజకీయంగా తనకు కలిసి వస్తుందని కన్నా భావించారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్ ను ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నారు. జనసేన నాయకత్వం సీనియర్ నేతను ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేలా చేసింది. ఇదే సమయంలో అటు టీడీపీ- వైసీపీ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అసలు జనసేన నుంచి ఎటువంటి కార్యాచరణ లేకపోవటం పైన సీనియర్లు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటు పొత్తుల పైన నిర్ణయంతో జనసేన ఆలోచన సీనియర్లకు అంతుచిక్కటం లేదు.

ఢిల్లీ నేతల కొత్త స్కెచ్.. టార్గెట్ టీడీపీ
ఏపీలో ఎన్నికల పొత్తుల వేళ..బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్న బీజేపీ నేతలు..అటు టీడీపీతో కలిసేందుకు సిద్దం అవుతున్న పవన్ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. పవన్ తనంతటగా తాను నిర్ణయం తీసుకొనే పరిస్థితి కల్పిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో ఎలా ఉన్నా.. ప్రధాని మోదీ- అమిత్ షా తో సత్సంబంధాలు ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. టీడీపీ-బీజేపీ తో కలిసి ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన. దీని కోసమే వేచి చూస్తన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు నో చెబుతోంది. టీడీపీతో లేకుండా బీజేపీతో కొనసాగేందుకు పవన్ కు ఇష్టం లేకపోయినా ఓపెన్ గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలకు అస్త్రంగా మారుతోంది.

కానీ, ఇదే సమయంలో టీడీపీ ఎన్నికల సమయానికి ఎటువంటి సమీకరణాలు ఎదురైనా.. పోటీ ఇచ్చేందుకు ముందుగానే వ్యూహాలతో సిద్దం అవుతోంది. వైసీపీ – టీడీపీ తరహా ఎన్నికల యాక్షన్ ప్లాన్ జనసేనలో కనిపించటం లేదు. దీంతో..ఇప్పుడు రానున్న రోజుల్లో ఎటువంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి రాజకీయంగా కనిపిస్తోంది.