ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మోదీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ప్రారంభించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్”ను ప్రారంభించిన ప్రధాని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆది మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర గిరిజనశాఖా మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. అనంతరం మోడీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు.
గిరిజన సంక్షేమం కోసం ఇంతకు ముందు ఎన్నడూ ఇంతలా ప్రయత్నాలు జరగలేదని ప్రధాని మోదీ అన్నారు. నేను దేశాధినేతలను కలిసినప్పుడు, మీ గర్వించదగిన సంప్రదాయాన్ని, బహుమతులను వారికి అందజేస్తాను. వాతావరణ మార్పులు, భూతాపం వంటి సవాళ్లకు మీకు పరిష్కారం కావాలంటే, మన గిరిజనుల జీవన సంప్రదాయాన్ని చూడండి… మీకు మార్గం దొరుకుతుందని ఈ రోజు భారతదేశం ప్రపంచానికి చెబుతోందని సూచించారు ప్రధాని మోదీ.
ఢిల్లీ, హర్యానా, యూపీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి గిరిజనుల ఉత్సాహాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తానని ప్రధాని అన్నారు. తాను గుజరాత్ సీఎం అయ్యాక గిరిజన ప్రాంతాల్లో సైన్స్ విద్యపై దృష్టి పెట్టడం లేదని గ్రహించానని.. తాను దానిపై దృష్టి పెట్టినట్లుగా గుర్తు చేసుకున్నారు. 2014 నుండి 2022 వరకు, 500 కంటే ఎక్కువ ఏకలవ్య పాఠశాలలు ఆమోదించబడ్డినట్లుగా తెలిపారు.
కొత్త విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ.. మాతృభాష ఎంపికను అందులో ఉంచామని ప్రధాని మోదీ తెలిపారు. 2014తో పోలిస్తే ఈసారి గిరిజనుల బడ్జెట్‌ను 5 రెట్లు పెంచామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన మహిళలు దేశానికి రాష్ట్రపతి అయ్యారని.. తొలిసారిగా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజనుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.
విశేషమేంటంటే, ఈసారి ప్రపంచం అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని జరుపుకోవడం. దీనిని శ్రీ అన్న అని పిలుస్తున్నారు. దీంతో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు గిరిజనుల ఆదాయం కూడా పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందని, దేశం అభివృద్ధిలో కొత్త కోణాలను తాకడానికి ఇదే కారణం. తనకు దూరమని భావించే వాడు ఇప్పుడు ప్రభుత్వం తన గుమ్మానికి వెళ్తోందన్నారు.
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ “ఆది మహోత్సవ్” అందరిని ఆకట్టుకుంటోంది.