తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్. అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజును పురస్కరించుకొని ఒమన్ దేశ రాజధాని మస్కట్ లో బి.ఆర్.ఎస్ ఎన్నారై సెల్ ఒమన్ శాఖ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒమాన్ భారతీయ ప్రవాసీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది….
కే.సి.ఆర్. గారి జన్మదిన వేడుకకు బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, కే.సి.ఆర్. గారి అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి, కే.సి.ఆర్. గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కే.సి.ఆర్. గారు తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడిగా సాగించిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ,
జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించిన తీరును కొనియాడారు….
బి.ఆర్.ఎస్. పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులను, కే.సి.ఆర్. అభిమానులను కోరడం జరిగింది….
అలాగే కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ఈ మధ్య సంభవించిన పెను విలయం ధాటికి అతలాకుతలమైన సిరియా, టర్కీ భూకంప బాధితుల సహాయార్థం బి.ఆర్.ఎస్. ఎన్.ఆర్.ఐ. సెల్ ఒమాన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాల పొడి ప్యాకెట్లు, బ్లాంకెట్స్, ఇతరాత్ర వస్తువులు సిరియా, టర్కీ ఎంబస్సి అధికారులకు అందచేయడం జరిగింది….
ఈ కార్యక్రమంలో బిఅరెస్ ఎన్నారై సెల్ ఒమన్ కార్యవర్గ సభ్యులు గైసింగరపు వినోద్ కుమార్ యాదవ్ ,నర్సయ్య, బొద్దుల కృష్ణ, గాంధారి నరేష్, కొత్త చిన్నయ్య, సాయి కృష్ణ, జాబేర్ పాషా, కృష్ణ,సాయి కిరణ్ రెడ్డి,రంజిత్, వంశీ, రాజు, వేణు, దినేష్, రాజేందర్, గంగాధర్, గంగాధర్, శ్రీనివాస్ నాగం, శ్రీనివాస్, అక్తర్, కనకరాజు, గణేష్, కాశీరామ్, రాజేంధర్, శంకర్, దాసు మొదలగు భారతీయ ప్రవాసీయులు పాల్గొన్నారు…