హైదరాబాద్: నగరంలో గత ఏడాది దసరా సందర్భంగా వరుస బాంబు పేలుళ్లకు కుట్రలు చేసిన కేసులో మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ కలీమ్ అలియాస్ కలీమ్‌ను.. సిట్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
లష్కరే తోయిబా, ఐఎస్ఐ ప్రోద్బలంతో హైదరాబాద్ నగరంలో గత ఏడాది దసరా రోజున వరుస పేలుళ్లతో భారీ నరమేధానికి కుట్రపన్నారు ఈ ఉగ్రవాదులు. అబ్దుల్ జాహెద్, మహమ్మద్ సమీయుద్దీన్, మాజా్ హసన్ ఫరూక్ ఈ మారణహోమం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్, సిట్ పోలీసులు గత అక్టోబర్ 2న ఈ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు.
నిందితుల నుంచి 4 చైనా గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు మరింత సమాచారం రాబట్టారు. దసరా రోజు పేలుళ్ల కోసం చైనాలో తయారైన 86పీ మిలిటరీ గ్రనేడ్లను కాశ్మీర్ ద్వారా భారత్‌లోకి తీసుకొచ్చారు. పాకిస్థాన్‌లోని మాజీద్.. వాట్సాప్ ద్వారా గ్రనేడ్లు ఉంచిన ప్రాంతం ఫొటోలు జాహెద్‌కు పంపాడు. 2022 సెప్టెంబర్ 28న మాజిద్ ఆదేశాలతో సమీయుద్దీన్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్దకు చేరాడు. మార్గమధ్యలో మేడ్చల్ వద్ద చేతి సంచి కొన్నాడు.
ఆ తర్వాత మనోహరాబాద్ సమీపంలోని డెడ్ డ్రాప్ దగ్గర నాలుగు గ్రనేడ్లను నగరానికి తీసుకొచ్చాడు. సమీయుద్దీన్, మాజ్ చెరో గ్రనేడ్ తీసుకున్నారు. రెండు జాహెద్ కు ఇచ్చాడు. సమావేశాలు, పండగలు లక్ష్యంగా వాటిని విసరాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సమీయుద్దీన్, అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫరూఖ్‌ను అరెస్ట్ చేశారు. చైనా తయారు చేసిన మిలిటరీ గ్రనేడ్లు, సుమారు రూ. 20 లక్షల హవాలా సొమ్ము, జాహెద్, మాజిద్ మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు సేకరించారు. గ్రనేడ్లు తీసుకెళ్లే సమయంలో సైదాబాద్-మనోహరాబాద్ వరకు 60 కిలోమీటర్ల మార్గంలో పది సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. అన్ని సాక్ష్యాలతో ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ సమి, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్‌లకు అబ్దుల్ కలీమ్ చేరవేశాడని.. వీరందర్నీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
చైనా తయారు చేసిన మిలిటరీ గ్రనేడ్లు, సుమారు రూ. 20 లక్షల హవాలా సొమ్ము, జాహెద్, మాజిద్ మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు సేకరించారు. గ్రనేడ్లు తీసుకెళ్లే సమయంలో సైదాబాద్-మనోహరాబాద్ వరకు 60 కిలోమీటర్ల మార్గంలో పది సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. అన్ని సాక్ష్యాలతో ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ సమి, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్‌లకు అబ్దుల్ కలీమ్ చేరవేశాడని.. వీరందర్నీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.