తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.వేకువ జామున నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలో అర్ధరాత్రి 2 గంటల నుంచే
దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర
రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున
తరలివచ్చారు. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలతో ఆ ముక్కంటి సేవలో తరిస్తున్నారు.