WorldWonders

111 అడుగుల ఎత్తైన బంగారు శివుని విగ్రహం..

111 అడుగుల ఎత్తైన బంగారు శివుని విగ్రహం..

గుజరాత్ లోని వడోదరలోని సుర్‌సాగర్ సరస్సులో కొలువైన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహన్ని శివరాత్రి రోజున సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుంది. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

గుజరాత్ లోని వడోదరలోని సుర్‌సాగర్ సరస్సులో కొలువైన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహన్ని శివరాత్రి రోజున సీఎం భూపేంద్ర పటేల్ చేతుల మీదుగా ప్రారంభంకానుంది. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రసిద్ధ సుర్‌సాగర్ సరస్సు మధ్యలో 12 కోట్ల రూపాయలతో విలువైన బంగారంతో ఈ భారీ విగ్రహానికి బంగారు పూత పూశారు. దీని కోసం 17.5 కేజీల బంగారాన్ని ఉపయోగించారు.దేవాధిదేవుని విగ్రహావిష్కరణకు ప్రజలు భారీ ఎత్తున తరలిరానున్నారు.దీని కోసం తగిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం

మంజల్‌పూర్‌ ఎమ్మెల్యే యోగేష్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని సత్యం, శివం, సుందరం సమితి అనే ట్రస్ట్ ఈ భారీ శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1996లో ప్రారంభమైన ఈ విగ్రహ నిర్మాణ పనులు 2002లతో పూర్తి అయ్యాయి.కాగా..ఈ విగ్రహం నిర్మాణం పూర్తి అయ్యిన ఆవిష్కరణ జరగలేదు. ఎందుకంటే ఈ విగ్రహాన్ని అప్పుడు బంగారు పూతతో ఏర్పాటు చేయలేదు. రాగితో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 2012లో ప్రజలకు అంకితం చేసిన 15 ఏళ్ల తర్వాత ఈ విగ్రహానికి బంగారు పూత వేయాలని స్వర్ణ సంకల్ప్ ఫౌండేషన్ సంకల్పించింది. కానీ అది బహుశా సాధ్యం కాకపోవచ్చని అప్పట్లో ఎమ్మెల్యే యోగేష్ పటేల్ అన్నారు. కానీ చివరకు దేవాదిదేవుడు విగ్రహానికి బంగారుపూతకు అంగీకరించారు.

అలా బంగారం పూతకు కావాల్సిన నిధులు సమర్పించటానికి ప్రజలు కూడా ముందుకొచ్చారు.సత్యం, శివం, సుందరం సమితి ట్రస్ట్ కు సహాయ సహకరాలు విరాళాల రూపంలో అందించారు. అలా రూ.12 కోట్ల ఖర్చుతో 17.5 కేజీల బంగారంతో బంగారు పూతకు ఉపయోగించారు.

వడోదరలో ఏటా నిర్వహించే శివుడి ఊరేగింపు సుర్‌సాగర్ దగ్గర ముగుస్తుంది. అప్పుడు విగ్రహం దగ్గర హారతి ఇవ్వనున్నారు. బంగారు పూతతో ఏర్పాటుచేసిన 111 అడుగుల శివుని విగ్రహాన్ని మహాశివరాత్రి సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ అధికారికంగా వడోదరకి అంకితం చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వడోదర నగర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. వడోదరా అంతా అప్పుడే శివరాత్రి సందడి నెలకొంది.