NRI-NRT

వెల్వడంలో ఘనంగా లకిరెడ్డి బాలిరెడ్డి విగ్రహావిష్కరణ

వెల్వడంలో ఘనంగా లకిరెడ్డి బాలిరెడ్డి  విగ్రహావిష్కరణ

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో ప్రవాస భారతీయులు, వెల్వడం ప్రముఖులు, లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఫౌండర్, దివంగత లకిరెడ్డి బాలిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం ఆవిష్కరించారు.

*_ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ లకిరెడ్డి బాలిరెడ్డి ఈ ప్రాంతానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎంతో కష్టపడి చదివి, ఎదిగిన దార్శనికులు లకిరెడ్డి బాలిరెడ్డి అని పేర్కొన్నారు. ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి, అమెరికా తీసుకెళ్లి వారి జీవితాలకు బంగారు బాట వేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. లకిరెడ్డి బాలిరెడ్డి గారు ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల నెలకొల్పి ఎందరో విద్యార్థులను ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. *

లకిరెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ ఏ స్వార్థం లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. వెల్వడం గ్రామంలో ప్రభుత్వ నిధులను వద్దని చెప్పి రూ.5 కోట్లతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి తమ స్వంత నిధులు వెచ్చించారని పేర్కొన్నారు. ఇదొక్కటే కాకుండా లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలను నిర్మించారని అన్నారు. వెల్వడంలో డ్రెయిన్లను నిర్మించారని అన్నారు. కుటుంబ విలువలు, అనుబంధాలు, ఆప్యాయతలకు చిరునామా లకిరెడ్డి కుటుంబమన్నారు. ఆ కుటుంబంతో మమేకం అవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో లకిరెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి కోమటి జయరాం లకిరెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.