NRI-NRT

అమెరికా కీలక నిర్ణయం.. స్థిర నివాసం కోరుకునే విదేశీయుల పిల్లలకు గుడ్ న్యూస్

అమెరికా కీలక నిర్ణయం.. స్థిర నివాసం కోరుకునే విదేశీయుల పిల్లలకు గుడ్ న్యూస్

చాలా మందికి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరుకుంటుంటారు.అందుకే భారత్, చైనా నుంచి పెద్ద ఎత్తున టెక్ నిపుణులు అక్కడికి వెళ్తుంటారు.

ఎవరికైనా పెళ్లైతే వారు తమ పిల్లలను కూడా తీసుకెళ్తుంటారు.అయితే వారి పిల్లలకు 21 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే అక్కడ ఉండొచ్చు.21 సంవత్సరాలు వస్తే అమెరికాలో ఉండడానికి వీలుండదు.ఇలాంటి పరిస్థితుల్లో చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ (CSPA) కింద 21 సంవత్సరాలు దాటిన వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది.

US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా కొన్ని మార్పులు తీసుకు రానుంది.అమెరికాలో స్థిరనివాసం కోరుకునే విదేశీ ఉద్యోగుల పిల్లలకు 21 ఏళ్లు దాటే వరకు మాత్రమే ఆ దేశంలో ఉండాలి.లేకుంటే అక్రమ వలసదారులుగా వారిని లెక్కిస్తారు.

బాల్యంలో అమెరికాకు తల్లిదండ్రులతో చాలా మంది పిల్లలు వస్తుంటారు.వారు చట్టపరమైన పర్యవేక్షణలో ఉండాలి.21 ఏళ్లు రాగానే స్థిర నివాసం లేదా ఉద్యోగం లేకుంటే వారిని తిరిగి దేశానికి పంపడం గురించి కూడా చర్చ ఉంది.అయితే ప్రస్తుతం వెసులుబాటు ప్రకారం 21 ఏళ్లు దాటినా వారు కూడా సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కొత్త మార్గదర్శకత్వం ప్రకారం, USCIS ఇప్పుడు CSPA ప్రయోజనాల కోసం ఈ పౌరులు కానివారి వయస్సును లెక్కించడానికి కొత్త విధానం అమలు చేయనుంది.ఉదాహరణకు దరఖాస్తు చేసుకునే పిల్లల వయసు 18 ఏళ్లు ఉంటే, వారు దరఖాస్తు 21 ఏళ్లలోపు వచ్చేలోపు పరిష్కారం లభించాలి.వారి స్థిర నివాసం లేదా ఉద్యోగ దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే మరో మూడు సంవత్సరాలు పేరెంట్స్‌తో అమెరికాలో ఉండేందుకు అవకాశం లభిస్తుంది.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో 5 లక్షలకు పైగా భారతీయులకు వెసులుబాటు కలగనుంది.