NRI-NRT

బ్రిటన్.. తాగి తండ్రి పై దాడి చేసిన భారతీయుడు. ఆపై జైలు శిక్ష

బ్రిటన్.. తాగి తండ్రి పై దాడి చేసిన భారతీయుడు. ఆపై జైలు శిక్ష

బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి (Indian Origin) క్షణికావేశంలో చేసిన పని ఇప్పుడతడికి ఏకంగా జీవిత ఖైదు (Sentenced Life Prison) పడేలా చేసింది.

లండన్: బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి (Indian Origin) క్షణికావేశంలో చేసిన పని ఇప్పుడతడికి ఏకంగా జీవిత ఖైదు (Sentenced Life Prison) పడేలా చేసింది. మద్యం మత్తులో తండ్రిపై షాంపైన్ బాటిల్‌తో (Champagne Bottle) దాడిచేయడంతో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. తాజాగా ఈ కేసు ఓల్డ్ బైలీ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన ఎన్నారైను (NRI) న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ లండన్‌లో (North London) నివాసముండే డీకాన్ పాల్ సింగ్ (54) తన తండ్రి అర్జున్ సింగ్ విగ్ (85), తల్లి దమన్‌జిత్ సింగ్‌తో (84) కలిసి ఉంటున్నాడు. ఈ ఫ్యామిలీ అక్కడ సుమారు నలభై ఏళ్లుగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో 2021, అక్టోబర్‌లో పూటుగా మద్యం సేవించిన డీకాన్ పాల్ సింగ్ మత్తులో తండ్రి అర్జున్ సింగ్‌పై షాంపైన్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అర్జున్ సింగ్‌కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం మెట్ పోలీసులకు తెలియడంతో పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. విచారణ సమయంలో తాను తన తండ్రిని కావాలని చంపాలేదని, అసలు ఆయనను హతమార్చాలనే ఉద్దేశం కూడా తనకు లేదని ఏదో పొరపాటున జరిగిపోయిందని వాపోయాడు. అయితే, అతడి వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం దోషిగా తేల్చింది. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. శుక్రవారం ఈ కేసు మరోసారి ఓల్డ్ బైలీ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన అర్జున్ సింగ్‌ను న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. కాగా, న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు మేరకు ఎన్నారై (NRI) కనీసం 18 ఏళ్లు జైల్లో ఉండాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.