DailyDose

ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం  ఐదుగురు మృతి

మేదరమెట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు…

చినగంజాం మండలం సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకునేందుకు వెళ్లారు…

రాత్రి 11:30 దాకా శివరాత్రి సందర్భంగా జరిగే సంబరాల్లో ఆనందంగా పాల్పంచుకున్నారు..

తమ స్వస్థలం గుంటూరు వెళ్లేందుకు కారులో తిరిగి ప్రయాణమయ్యారు…

మేదరమెట్ల నుండి గుంటూరు వెళ్ళేందుకు రోడ్డు ఎక్కే సమయంలో కారు లారీని ని ఢీకొనడంతో కారులో ఉన్న ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి…

శివుని దర్శనం చేసుకుని వస్తున్న వారు శివ సాన్నిద్యానికి చేరారు…

కారు ముందు భాగం తుక్కుతుక్కు అయింది… అర్ధరాత్రి 12 గంటలు 1 గంట మధ్యలో ఈ ప్రమాదం జరిగింది… ఈ ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక కూడా ఉంది…

కారు డ్రైవర్ తో సహా కారులోని ఐదుగురు ఈ ఘటనలో మరణించారు.. కార్ డ్రైవర్ బ్రహ్మచారి మినహా మిగిలిన వారు మహిళలు

మృతుల వివరాలు:

షేక్ వహీదా వలి 38

షేక్ ఆయేషా హుమేరవలి 9

గురజాల జయశ్రీ 50

గురజాల దివ్య తేజ 29

కొండముడి వీర బ్రహ్మచారి 22

అక్కడికక్కడే మరణించారు సిఐ రోశయ్య ఎస్సై శివకుమార్ సంఘటనస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు