Politics

భాజపా గుట్టు బయట పెట్టిన కన్నా

భాజపా గుట్టు బయట పెట్టిన కన్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పై బీజేపీ గుట్టును మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బయటపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi)పై బీజేపీ గుట్టును మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) బయటపెట్టారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత, అజ్ఞాన నిర్ణయానికి వ్యతిరేకంగా తాను బీజేపీ (BJP) అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అమరావతి ఉద్యమంలో పాల్గొన్నానని కన్నా తెలిపారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ తోడుగా ఉంటుందని తీర్మానం చేయడం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై వ్యతిరేకంగా ప్రజల తరుపున పోరాటం చేస్తున్నానని కన్నా తెలిపారు.

కరోనా అనంతరం తన బీజేపీ అధ్యక్ష పదవి నుంచి మార్చారని చెప్పారు. సోమువీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా చేయడం జరిగిందని చెప్పారు. సోమువీర్రాజు బీజేపీ అధ్యక్షుడుగా ఎన్నికైన నాటి నుంచి కూడా కక్షసాధింపే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారని, స్థానిక నాయకత్వానికి పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ అంటే జీవితకాలం అభిమానం తమకు ఉంటుందని కన్నా చెప్పారు. మోదీపై ఉన్న అభిమానం ఎప్పటికీ పోదని తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిస్థితులను చూసి పార్టీలో ఇమడలేక.. ఈ రోజు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని కన్నా పేర్కొన్నారు. తనతోపాటు బీజేపీకి రాజీనామా చేసిన తన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కన్నా వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై మిత్రులతో చర్చించి ప్రకటిస్తానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కూడా కన్నా బాటలోనే పయనించారు. బీజేపీతో 9 ఏళ్ల బంధాన్ని వదులుకున్నారు. సోము వీర్రాజు తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ మీద నమ్మకం ఉందంటూనే రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు, జీవీఎల్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదన్నది కన్నా వాదన. కొన్ని రోజులు ఆగాలని గడువు పెట్టినా అధిష్టానం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఇక రాజీనామా చేశానన్నారు.