Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *(19-02-2023 నుండి 25-02-2023) ✍🏻**
*🗓 *ఈ వారం మీ రాశి ఫలితాలు 🗓**

🐐 మేషం (19-02-2023 నుండి 25-02-2023)

అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేయండి, మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ముందుకు సాగండి. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన
విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. చంచల స్వభావాన్ని రానీయకండి.అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వారం మధ్యలో స్వల్పలాభం చేకూరుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (19-02-2023 నుండి 25-02-2023)

ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక వార్త మీ మానసికశక్తిని పెంచుతుంది. పెద్దల సహకారం పూర్తిగా అందుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (19-02-2023 నుండి 25-02-2023)

గ్రహబలం తక్కువగా ఉంది. చేపట్టిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం అవసరం. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బంది పెట్టేవారి నుంచి దూరంగా ఉండాలి కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయ సందర్శనం
శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (19-02-2023 నుండి 25-02-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఉంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు.కొత్త బాధ్యతలు మీదపడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించగలుగుతారు. లక్ష్యం నెరవేరుతుంది.సమయానుకూలంగా ముందుకు సాగండి. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. భూగృహ లాభాలు ఉన్నాయి. తోటి వారి సహకారం అందుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణసౌఖ్యం కలదు. సూర్య ఆరాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (19-02-2023 నుండి 25-02-2023)

ప్రయత్నాలు నెరవేరుతాయి. పట్టుదలతో పనిచేయండి, శుభఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుతారు.ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభకు గౌరవ సన్మానాలను పొందుతారు. మనోబలం కలదు.ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (19-02-2023 నుండి 25-02-2023)

మంచి శుభకాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి.ఒక ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగించండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త మీ ఆనందాన్ని పెంచుతుంది. ఈశ్వర నామస్మరణ మేలుచేస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల (19-02-2023 నుండి 25-02-2023)

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆశించిన ఫలితాల కోసం బాగా శ్రమించాలి.ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. నవగ్రహ స్తోత్రం చదివితే మంచి
ఫలితాలు పొందుతారు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (19-02-2023 నుండి 25-02-2023)

లక్ష్యాలు నెరవేరేవరకు పట్టు వదలకండి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. ధర్మమార్గంలో పయనించండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. బంధు, మిత్రులను కలుపుకొనిపోవడం. ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవత ఆరాధన
మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (19-02-2023 నుండి 25-02-2023)

మీ మీ రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. గొప్ప ఆలోచనావిధానంతో సత్కార్యాలు చేపడతారు.సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం ఉంది. కొన్ని వార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. విందు,వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో లాభపడతారు.కుటుంబ సభ్యులతో కలిసి చేసే కీలక చర్చలు మీకు లాభిస్తాయి. గతంలో కాని పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. లక్ష్మీ అష్టోత్తరం చదివితే శుభప్రదం
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (19-02-2023 నుండి 25-02-2023)

ప్రారంభించబోయే పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు ఫలిస్తాయి లక్ష్యసాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇబ్బంది పెట్టే సంఘటనలకు
దూరంగా ఉండండి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (19-02-2023 నుండి 25-02-2023)

అదృష్టప్రాప్తి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవా సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుంచి దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయకండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతాధ్యానం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (19-02-2023 నుండి 25-02-2023)

అనుకూలమైన కాలం. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఇంతటి శుభకాలం మళ్లీ రావడానికి చాలాకాలం పడుతుందని గుర్తించండి. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. సూర్య ఆరాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈