Foreign investors: జనవరి నుంచి నిరంతరంగా కొనసాగిన విదేశీమదుపర్ల (Foreign investors) అమ్మకాలకు గతవారం బ్రేక్ పడింది.
విదేశీ మదుపర్లు (Foreign investors) తిరిగి భారత ఈక్విటీ మార్కెట్ల (Stock Market) పై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. గతవారం వారు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మొత్తం రూ.7,600 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.అంతకు ముందు వారం (ఫిబ్రవరి 7-12)లో ‘విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (FPIs)’ రూ.3,920 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. మార్కెట్లు అదానీ షాక్ నుంచి తేరుకుంటున్నాయని మార్నింగ్ స్టార్
ఇండియాలో అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎఫీపీఐ (FPIs)ల నిధుల ప్రవాహం పుంజుకుంటోందని పేర్కొన్నారు. భారత ఈక్విటీలపై విదేశీ మదుపర్లకు ఉన్న ఆసక్తిని ఇది తెలియజేస్తోందన్నారు.
జనవరి నుంచి నిరంతరంగా కొనసాగిన విదేశీ మదుపర్ల (Foreign investors) అమ్మకాలు ఇక ముగిసినట్లే కనిపిస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ తెలిపారు.అయితే, గరిష్ఠాల వద్ద మళ్లీ అమ్మకాలు దిగే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ,బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, గణనీయ ఆర్థిక వృద్ధికి ఉన్న అవకాశాలు ఎఫీఐలను ఆకర్షిస్తున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. ఈ నేపథ్యంలో వాళ్లు షేర్ల విలువ, ఇతర ఆందోళనలను సైతం కాదని భారత ఈక్విటీలకు ఎక్కువ
చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారన్నారు.ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిబ్రవరి 10 వరకు
ఎఫ్పీఐలు నికర కొనుగోలుదారులుగా నిలుస్తున్నారు.2023లో ఇప్పటి వరకు రూ.38,524 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. ఒక్క జనవరిలోనే రూ.28,852 కోట్లు విలువ చేసే షేర్లను వదిలించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో గత నెల భారీగా అమ్మకాలకు దిగారు. షేర్లు అధిక ధరలకు చేరినట్లు భావించడం వల్ల కూడా వాళ్లు ఇతర మార్కెట్ల వైపు మళ్లారు.