Devotional

ఫాల్గుణ మాసం విశిష్టత

ఫాల్గుణ మాసం  విశిష్టత

ఫాల్గుణం… విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు “పయోవ్రతం” ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం , ధనదానం , వస్త్రదానం , గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు , వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా , సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.

వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు , లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి , పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు , రామకృష్ణ పరమహంస , స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ‘ఫల్గుణ’ అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు , ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు , దుర్యోధనుడు , దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

🌹ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు ఆరాధన🌹

శ్లో || నరాడోలా గతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం !
ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్ !

శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే , ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’ గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి , సూర్యుడికి అర్ఘ్యమిచ్చి , విష్ణువును షోడశోపచారాలతో పూజించి , పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు , పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు.

ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ , ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి , చతుర్థినాడు అవిఘ్న , పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు.

ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు. దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి , ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ , హోలికా పూర్ణిమ , కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి – కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు , మన్మథుడు , కృష్ణుడు , లక్ష్మీదేవి పూజలందుకుంటారు.

ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి , సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి , అన్నదానం చేస్తారు.

ఫాల్గుణ మాస ప్రాశస్త్యం

పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు , పండుగలూ , ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం.

ఈ మాసాధిపతి గోవిందుడు కావున , ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు , గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు , అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను , గోవులను రక్షించేవాడు అంతేకాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత , అనంత , గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది.

ఆ పవిత్ర మూర్తి యెదుట యెట్లు ప్రవర్తింప వలెనో విద్యాధికుడవైన నీకు తెలియదా! వెంటనే శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి చెంతకు వెడలి ఆయన పాదములపైబడి క్షమా బిక్షనర్ధించి పవిత్రుడవై నా వద్దకు రమ్ము అని పలికెను.

బిదరహల్లి శ్రీనివాసతీర్థులు పవిత్ర జీవనమును గడుపుచున్న భక్తుడు. కాని, అతని ప్రారబ్ధము అతనిచే నిట్లు గురు జనా పరాధమొనరింప జేసెను. అన్నియు తెలిసియు తెలియని వాడయ్యెను. ఆహా! ప్రారబ్ధానుభవ మెంతపని చేసెను. వెంటనే శ్రీనివాసతీర్థులు మంచాల కు తిరిగి వెళ్ళి శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి పాదము లపైబడి ఉచ్ఛైస్వరముతో విలపించుచు తన యపరాధమును క్షమింప వలసినదిగ ప్రార్థింప దొడంగెను.

అపుడు శ్రీస్వామి కృపా దృక్కులను ప్రసరింప జేయుచు “శ్రీనివాసా! నీవు నీ విద్యా గురువుకడకు చేరితివికదా! ఆయన నిన్ను మరల ఇక్కడకు పంపినాడు కదా!” యని పలికెను. అపుడు శ్రీనివాస తీర్ధులు “మహాత్మా! నీవు సర్వాంతర్యామివి.
భూత భవిష్యత్వర్త మానముల నెరింగిన సర్వజ్ఞడవు, నేను అజ్ఞాని ని, మూర్ఖుడను, నీవు గొప్పవాడవు, దైవస్వరూ పుడవు, నేను దీనుడను, హీనుడను, పాపిని, నన్ను క్షమింపుడు. నన్ను ఎక్కుండి పంపకుండ మీరే ఏల శిక్షింపరైరి. నన్ను క్షమింపుడు, నన్ననుగ్రహిం పు” డని యనేకవిధముల ప్రార్థింప దొడంగెను.

ఆదినముననే శ్రీస్వామి వారి సరసన శ్రీనివాస తీర్థులకుగూడ భగవత్ప్ర సాదము వడ్డింపబడెను. అందు ఆవాలతోగూడిన రసముకూడ వడ్డింప బడెను. శ్రీనివాసతీర్థులు పశ్చాత్తప్త హృదయుడై భక్తితో ఆ రసమును స్వీకరించెను. భోజనానంత
రము శ్రీరాఘ వేంద్రతీర్ధుల పాదముల నాశ్రయించి ఆయన యనుగ్రహమునకు పాత్రుడై ఫలమంత్రాక్షతల లను బొంది పాపవిముక్తు డయ్యెను. తదనంతరము శ్రీస్వామివారి యనుమతి గైకొని తనవిద్యాగురువు లైన శ్రీయాద వార్యులను దర్శించుటకు ఎక్కుండి బయలు దేరెను.

శ్రీరాఘవేంద్రతీర్ధ
స్వాముల పూజారులు:

భగవద్భక్తులైనవారు తీర్థ యాత్రల నొనరించుచు పవిత్ర క్షేత్రములను దర్శించి పవిత్ర నదీ జలములందు స్నాన మాడుచు దేశాటన మొనరింతురు. దక్షిణ భారతదేశములో ఒక గ్రామమందు ముగ్గురు సద్బ్రాహ్మణులు కలరు. వారు భగవద్భక్తులు, పవిత్రాచరణము గల ఆదర్శగృహస్థులు, సత
తము శ్రీహరినామసంకీర్తన పరులు, మిత్రులు. ఈ మువ్వురు మధ్వసాంప్రదా యమునకు చెందినవారు విద్వాంసులు. వారు శ్రీ మధ్వాచార్యులు శాసించిన ప్రకారము తమ జీవనము గడుపుచున్న పవిత్రులు. వారు తీర్థయాత్రల నొనరిం చుచు బళ్ళారి ప్రాంతము న కరుదెంచిరి. ఆదోని చెంత మంచాలలో శ్రీరాఘ వేంద్రతీర్థులను మధ్వ యతీశ్వరుడు విరాజిల్లి యున్నాడని తెలిసికొని ఆయనను దర్శింపవలె నని, పవిత్ర తుంగభద్రానదీ జలములందు స్నానమాడ వలెనని బయలు దేరిరి. మార్గములో రాఘవేంద్ర తీర్థస్వామియొక్క అద్భుత ములైన లీలలను, తపశ్శక్తిని, మహత్తరమైన అనుగ్రహశక్తిని, సాహిత్య మందుగల విద్వత్తును, వీటన్నింటికంటే అపరోక్ష జ్ఞానమును. సర్వజ్ఞత్వ మును, సర్వవ్యాపకత్వ మును ప్రజలు ఇంటింటను చర్చించుకొనుట ఆలకిం చిరి. వారు ఈ విషయ ములనన్నింటిని విని ఆశ్చర్యచకితులైరి. ఒకే వ్యక్తి అసంఖ్యాకములైన సిద్ధులను కల్గియుండుట అసంభవమని, గోరంతలు కొండంతలు చేసి శ్రీస్వామి వారి నాశ్రయించిన జనులు ప్రచారము చేయుచుండ వచ్చునని భావించుకొనిరి. ఎట్లైనను ఆయన మధ్వ యతీశ్వరులు గావున ఆయనను దర్శించి ఆయన సిద్ధులను పరీక్షింప వలయునని నిర్ణయించుకొనిరి. వారు మువ్వురును ఇట్లను కొనిరి. “మనము మనస్సులలో ఒక పదార్ధ మును తినవలయునని సంకల్పించుకొనవలెను. మంచాలలో మఠమందు భోజన సమయమున శ్రీస్వామి మనమర్ధింప కుండగనే ఆ పదార్థము లను మనకు వడ్డింప వలెనని కోరినచో శ్రీస్వామి సర్వాంతర్యామి యని, సకల సిద్ధులు కలవాడని విశ్వసింపవలెను. లేనిచో ఎందరో యతీశ్వరులవలె ఈయనకూడ ఒక సామాన్యుడని ఋజువు కాగలదు” అని ఈ ఉపాయము అద్భుతముగ నున్నదని మువ్వురు భక్తులు నిశ్చయించుకొని తమ మనస్సులలో ప్రత్యేక పదార్థమును శ్రీ రాఘవేంద్ర స్వామి మఠములో భుజింపవలెనని నిర్ణయిం చుకొని దానిని బహిర్గత మొనరింపక మనస్సులోనే యుంచుకొని మంచాలకు బయలుదేరిరి. మధ్యాహ్న సమయమునకు మంచాల మఠమును చేరి తుంగ భద్రానదిలో స్నానమొన రించిన తదుపరి శ్రీస్వామి నిదర్శించుట ఉత్తమమని తలంచి స్నానము చేయుటకు నదీ తీరము నకు జనిరి.