Politics

పగో జిల్లా వైకాపా నేతల్లో అసంతృప్తి ..

పగో జిల్లా వైకాపా నేతల్లో అసంతృప్తి ..

ఉమ్మడి పగో జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్లనూ పశ్చిమ గోదావరి జిల్లా నేతలకే కేటాయించిన వైసీపీ అధిష్టానం

ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా లోనూ మొండిచేయి

టికెట్ ఆశించిన ఏలూరు జిల్లా వైసీపీ నేతల్లో తీవ్ర భంగపాటు

టికెట్ ఖరారైన కవురు శ్రీనివాస్, వంకా రవీంద్ర శ్రేణుల్లో హర్షం

జడ్పి చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ కవురు శ్రీనివాస్ (బీసీ శెట్టి బలిజ) కు టికెట్

తణుకు కు చెందిన MSME కార్పోరేషన్ చైర్మన్ వంకా రవీంద్ర (కాపు) కు టికెట్

ముందు నుండి రేసులో ఉన్న మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు వర్గాల్లో తీవ్ర నిరుత్సాహం

పార్టీ మారే ఆలోచనలో ఇరువురి నేతలు